1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : సోమవారం, 21 జులై 2014 (17:33 IST)

భార్య, భర్తకు ఏ వైపు ఉండాలి? నల్లపూసలెందుకు ధరిస్తారు?

సంప్రదాయం ప్రకారం సమస్త కార్యాలలోనూ ఎడమ వైపే భార్య ఉండాలని చెప్పడం లేదు. పూజాదికులు నిర్వహించేటప్పుడు దానాలు, ధర్మాలు చేసే సమయాన భార్య, భర్త ఎడమ వైపున ఉండాలి. కన్యాదాన సమయాన, విగ్రహ ప్రతిష్టలప్పడు కుడివైపున ఉండాలి. బ్రహ్మదేవుడు మగవాడిని కుడి భాగం నుంచి, స్త్రీని ఎడమ భాగం నుంచి సృష్టించాడని శాస్త్రాలు చెపుతున్నాయి. శ్రీమహా విష్ణువు శ్రీ మహా లక్ష్మిని ఎడమ స్థానంలో పదిలంగా ఉంచుకుంటాడు. 
 
ఇక నల్లపూసల్ని ఎందుకు ధరించాలంటే.. మంగళసూత్రంతో పాటు నల్లపూసలు గొలుసుగా ధరించడం మన సంప్రదాయం. దుష్ట శక్తులు తన మాంగల్యం మీద పడకుండా ఉండటానికి ధరిస్తారు. అంతేకాకుండా నల్లపూసలు సంతాన సాఫల్యానికి, దానానికి, సుఖానికి చిహ్నాలు. నల్లపూసలు మంగళకరమైన, సౌభాగ్యమైన ఆభరణము అని పురోహితులు చెబుతున్నారు.