మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Modified: శనివారం, 6 అక్టోబరు 2018 (19:14 IST)

07-10-2018 నుంచి 13-10-2018 మీ వార రాశి ఫలితాలు(Video)

కర్కాటకంలో రాహువు, కన్యలో రవి, తులలో గురు, బుధు, వక్రి శుక్రులు, ధనస్సులో శని, మకరంలో కుజ, కేతువులకు సింహ, కన్య, తుల, వృశ్చికంలో చంద్రుడు. 11న గురువు వృశ్చిక ప్రవేశం. 12వ తేదీ నుండి భీమ నది పుష్కరాలు ప్రారంభం, 7న మాస శివరాత్రి. 10వ తేదీ నుండి శరన్నవరాత్రి ఉత్సావాలు ప్రారంభం.
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
సంప్రదింపులు అనుకూలం. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. గృహం సందడిగా ఉంటుంది. ఆరోగ్యం సంతృప్తికరం. ఆర్థికంగా బాగుంటుంది. మంగళ, శని వార్లో ఖర్చులు విపరీతం. వానం కొనగోలు చేస్తారు. రశీదులు, పత్రాలు జాగ్రత్త. పనులు చురుకుగా సాగుతాయి. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. తప్పటగుడుగు వేసే ఆస్కారం ఉంది. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. పెద్దల సలహా పాటించండి. ఉద్యోగస్తులకు ధనలాభం. అధికారులకు కొత్త బాధ్యతలు, పనిభారం, వ్యాపారాలు ఊపందుకుంటాయి. కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. కళ, క్రీడారాకులకు ప్రోత్సాహకరం. ప్రయాణంలో చికాకులు తప్పవు.  
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. పెట్టుబడులకు అనుకూలం. పరిచయాలు బలపడుతాయి. వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. సాధ్యం కాని విషయాలకు హామీలివ్వవద్దు. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తుంది. పట్టుదలతో శ్రమిస్తారు. పరిస్థితుల అనుకూలత ఉంది. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఖర్చులు అంచాలను మించుతాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. గురు, శుక్ర వారాల్లో నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. చుట్టుప్రక్కల వారిని గమనించండి. పనుల ప్రారంభంలో ఆటంకాలెదుర్కుంటారు. ఉద్యోగస్తులకు అడ్వాన్స్‌లు మంజూరవుతాయి. ఆశావవహ దృక్పథంతో ఉద్యోగయత్నం సాగించండి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు.   
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. ఒకరికి సలహా ఇచ్చి మరొకరికి వ్యతిరేకులవుతారు. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. పత్రాలు, నగదు, ఆభరణాలు జాగ్రత్త. అపరిచితులతో మితంగా సంభాషించండి. ధైర్యంగా వ్యవహరిస్తారు. మీపై అభియోగాలు తొలగిపోగలవు. ప్రతిభాపాటపాలు వెలుగులోకి వస్తాయి. శనివారం నాడు చాకచక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. ఖర్చులు విపరీతం. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆరోగ్యం సంతృప్తికరం. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతులు అధికమవుతాయి. వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. భాగస్వామిక చర్యలు ఫలిస్తాయి. వృత్తుల వారికి పురోభివృద్ధి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. క్రీడాపోటీల్లో విజయం సాధిస్తారు. దైవదర్శనాలు ఉల్లాసాన్నిస్తాయి. 
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఈ వారం సంప్రదింపులకు అనుకూలం. మీ అభిప్రాయాలను మధ్యవర్తుల ద్వారా తెలియజేయండి. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. దంపతులకు కొత్త ఆలోచనలు వస్తాయి. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. ఆర్థికంగా కుదుటపడుతారు. రుణ సమస్యలు తొలగుతాయి. వివాహయత్నాలు సాగిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. పనులు చురుకుగా సాగుతాయి. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. ఆత్మీయుల ఆరోగ్యం కుదుటపడుతుంది. పదవులు, బాధ్యతలు నుండి తప్పుకుంటారు. వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. పెట్టుబడులకు అనుకూలం. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉద్యోగస్తులకు లాభదాయకం. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరం. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణం తగదు.  
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆదాయం బాగుంటుంది. మెుండి బాకీలు వసూలవుతాయి. పనుల ప్రారంభంలో ఆటంకాలెదుర్కుంటారు. మీపై శకునాల ప్రభాలం అధికం. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. వ్యవహారాలతో తీరిక ఉండదు. కీలక విషయాలపై పట్టు సాధిస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడుతాయి. పదవుల స్వీకరణకు అనుకూలం. సంతానం దూకుడును అదుపుచేయండి. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతి, ప్రశంసలు, సత్కారాలు అందుకుంటారు. విందులు వినోదాల్లో మితంగా ఉండాలి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీల్లో సంతృప్తికానవస్తుంది.  
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
పెట్టుబడులు, స్థిరాస్తి కొనుగోలుకు అనుకూలం. భాగస్వామిక చర్చలు కొలిక్కి వస్తాయి. ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వ్యాపారులు ఊపందుకుంటాయి. శుభకార్య యత్నం ఫలిస్తుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. బాధ్యతలు అప్పగించవద్దు. ఖర్చులు విపరీతం. పొదుపు మూలక ధనం అందుకుంటారు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. కావలసిన పత్రాలు సమాయానికి కనిపించవు. ఆది, సోమ వారాల్లో వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. మీ శ్రీమతి సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. వృత్తుల వారికి సామాన్యం. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. మార్కెట్ రంగాల వారికి ఆశాజనకం. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు హోదామార్పు, స్థానచలనం. ప్రయాణం తలపెడతారు. దైవదర్శనం సంతృప్తినిస్తుంది.  
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సంప్రదింపులు అనుకూలం. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. మంగళ, బుధ వారాల్లో ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. గృహమార్పు వలన కలిసివచ్చే ఆస్కారం ఉంది. ఆరోగ్యం సంతృప్తికరం. అవివాహిత యువకులకు నిరుత్సాహం. ఖర్చులు అంచాలను మించుతాయి. రాబడిపై దృష్టి పెడుతారు. చెల్లిపులు వాయిదా వేసుకుంటారు. ఆలోచనలు చికాకుపరుస్తాయి. పట్టుదలతో శ్రమించిన గాని పనులు పూర్తికావు. అయిన వారు మీ అశక్తతను అర్థం చేసుకుంటారు. ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు ధనయోగం. అధికారులకు కొత్త చికాకులు తలెత్తుతాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. విద్యార్థులకు పరిచయాలు ఉల్లాసాన్నిస్తాయి. దైవదర్శనంలో అవస్థలు తప్పవు. 
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ట
అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి పొందుతారు. సంతానం వైఖరి ఇబ్బంది కలిగిస్తుంది. సౌమ్యంగా మెలగండి. భేషజాలకు పోవద్దు. దంపతుల మధ్య. అవగాహన నెలకొంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పరిస్థితులు చక్కబడుతాయి. కొంతమెుత్తం ధనం అందుతుంది. మానసికంగా కుదుటపడుతారు. ఖర్చులు అధికం, సంతృప్తికరం. పనులు వేగవంతమవుతాయి. సంప్రదింపులకు అనుకూలం. తొందరపాటుతనం తగదు. గురు, శుక్ర వారాల్లో మీ మాటతీరు అదుపులో ఉంచుకోవాలి. నిరుద్యోగులు ఇంటర్వ్యూలు సంతృప్తినీయవు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. టెండర్లు, ఏజెన్సీలు అనుకూలించవు. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. 
 
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
వేడుకల్లో పాల్గొంటారు. బంధువుల ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. విలువైన కానుకలు చదివించుకుంటారు. ఆర్థికస్థితి ఆశాజనకం. ఖర్చులు భారమనిపించవు. ఆత్మీయులకు సాయం అందిస్తారు. మీ జోక్యం అనివార్యం. వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. పనులు ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. శనివారం నాడు నగదు, పత్రాలు జాగ్రత. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. పరిచయాలు బలపడుతాయి. ముఖ్యమైన పత్రాలు జాగ్రత్త. ఉద్యోగస్తులకు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది. పదవులు, బాధ్యతలు స్వీకరిస్తారు. అధికారులకు ధనప్రలోభం తగదు. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. వైద్య, న్యాయ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. కోర్టు వ్యవహారాలు విచారణకు రాగలవు. 
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఖర్చులు అధికం, ధనానికి ఇబ్బంది ఉండదు. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ప్రైవేటు సంస్థల్లో మదుపు క్షేమం కాదు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. పరిస్థితులు క్రమంగా చక్కబడుతాయి. ఆందోళన తొలగి కుదుటపడుతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. పరిచయాలు, వ్యాపకాలు పెంపొందుతాయి. పనులు మెుండిగా పూర్తిచేస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. విదేశీ విద్యా ప్రకటనలను విశ్వసించవద్దు. ఆది, సోమ వారాల్లో అప్రియమైన వార్త వినవలసి వస్తుంది. వ్యాపారాల్లో లాభాలు, అనుభవం గడిస్తారు. మీ పథకాలు సత్పలితాలిస్తాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. అత్యుత్సాహం ప్రదర్శించవద్దు. జూదాల జోలికిపోవద్దు. దైవదర్శనం సంతృప్తినిస్తుంది. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరం.  
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
అన్ని రంగాల వారికి ఆశాజనకమే. పదవులు అందుకుంటారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కష్టానికి గుర్తింపు లభిస్తుంది. అనేక పనులతో సతమతమవుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. మంగళ, బుధ వారాల్లో బాధ్యతలు అప్పగించవద్దు. శుభకార్యం నిశ్చయమవుతుంది. ఆత్మీయులను వేడుకలకు ఆహ్వానిస్తారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. విలువైన వస్తువులు, నగదు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. సంతానం విజయం సంతోషాన్నిస్తుంది. వృత్తి ఉపాధి పథకాల్లో స్థిరపడుతారు. ఉద్యోగస్తులకు పదవీయోగం, ధనప్రాప్తి. హోల్‌సేల్ వ్యాపారులకు, స్టాకిస్టులకు ఆదాయాభివృద్ధి. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది.  
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. అవకాశాలు అందినట్టే చేజారిపోతాయి. పట్టుదలతో ముందుకు సాగండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. వ్యవహారాలతో హడావుడిగా ఉంటారు. ఒత్తిడి, ఆందోళన అధికం. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలబడదు. సన్నిహితుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. పనులు మెుండిగా పూర్తిచేస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. సంతానం కదలికలపై దృష్టి సారించండి. చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు. ఆది, గురు వారాల్లో పెద్దల వ్యాఖ్యాలు ఆలోచింపచేస్తాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు ధనయోగం. అధికారులకు కొత్త బాధ్యతలు, పనిభారం. దైవదర్శనాల్లో ఒకింత అవస్థలు తప్పవు. 
 
వీడియోలో కూడా వినవచ్చు...