శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. మనస్తత్వ శాస్త్రం
Written By chj
Last Modified: శుక్రవారం, 23 మార్చి 2018 (20:48 IST)

బంగారం కంటే అందమైనది శృంగారం... స్త్రీపురుషులు అప్పుడెలా?

నవరసాలలో ఒక రసం శృంగారం. అందంగా కన్పించటానికి ఆరోగ్య రక్షణకు శరీరాన్ని శుభ్రపరచుకుని అలంకరించుకోడాన్ని శృంగారం అంటారు. బంగారం అందంగా ఉంటుంది. అంతకంటే అందంగా శృంగారం ఉంటుంది. అందుకే అంటారు బంగారాన్ని మించినది శృంగారమని. దేవాలయాల్లో దేవుడికి చేసే అలంకా

నవరసాలలో ఒక రసం శృంగారం. అందంగా కన్పించటానికి ఆరోగ్య రక్షణకు శరీరాన్ని శుభ్రపరచుకుని అలంకరించుకోడాన్ని శృంగారం అంటారు. బంగారం అందంగా ఉంటుంది. అంతకంటే అందంగా శృంగారం ఉంటుంది. అందుకే అంటారు బంగారాన్ని మించినది శృంగారమని. దేవాలయాల్లో దేవుడికి చేసే అలంకారాన్ని శృంగారం అంటారు. ప్రతి మగవాడు బయట కింగ్‌లాగా ఉంటాడు. నాకు సాధ్యం కానిది ఏముందిలే అనుకుంటాడు.
 
కాని ఒక్క విషయంలో మాత్రం ఎంతటి కింగ్ అయినా కాస్త తగ్గాల్సిందే అది అమ్మాయిల దగ్గర. వాళ్ల ప్రేమను పొందాలన్నా, వారిని ఆనందపరచాలన్నా అబ్బాయిలు డౌన్ కావలసిందే. ఎందుకంటే ఆ సమయంలో వారిని సంతోష పెట్టాలంటే మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే. సాధారణంగా ఆ పని చేస్తే తప్ప తాము ఆ ప్రేమని పొందలేరు. 
 
మహిళలు రతి సమయంలో భర్త తనతో చాలా ప్రేమగా మాట్లాడాలని కోరుకుంటారు. జీవితంలోని ఇతర వత్తిడిలు దూరమయ్యేలా ఆమెని చాలా ప్రేమగా మాట్లాడుతూ దగ్గరికి తీసుకోవాలి. తన పర్సనల్ సమస్యలను అడిగి తెలుసుకోవాలి. ఆమె ఏ విషయంలో మీరు కఠినంగా మాట్లాడటం, దూరంగా నెట్టివేయడం, విమర్శించడం లాంటివి చేస్తే రతి సమయంలో ఇబ్బందులు పడాల్సివస్తుంది.
 
అలాకాకుండా మీరు వారికి నచ్చినట్లుగా ఉండండి. రతి అయిపోగానే చాలామంది మగవారు పక్కకు తిరిగేసి పడుకుంటారు. కాని ఏదో ఒక పని అయిపోయింది అన్నట్లు కాకుండా భార్య ఫీలింగ్స్‌ని బట్టి మగవారు ప్రవర్తించాలని, తను ఇంకా ఏమన్నా కోరుకుంటుందేమో అన్న విషయం అడిగి తెలుసుకోవాలని అలా అయితే దాంపత్య జీవితం సుఖవంతంగా ఉంటుందని శృంగార నిపుణులు చెబుతున్నారు.