ఆదివారం, 12 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. మనస్తత్వ శాస్త్రం
Written By ivr
Last Modified: మంగళవారం, 26 జులై 2016 (20:57 IST)

రెండేళ్లు బాగా ప్రయత్నించా...కుదర్లేదు, 6 ఏళ్లుగా విడిగా ఉంటున్నాం... భార్యను వదిలేస్తే...

యవ్వనంలో ఉన్నప్పుడు నా స్నేహితులతో నా సెక్స్ సామర్థ్యం గురించి తెగ చెప్పుకునేవాడిని. పెళ్లయ్యాక నలుగురైదుగురు పిల్లల్ని కంటానని గొప్పలు చెప్పేవాడిని. బాగా చదివి సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయ్యాను. పెళ్లి చేసుకున్నాను. ఐతే పెళ్లయ్యాక అక్కడ అసలు సంగతి బయటపడిం

యవ్వనంలో ఉన్నప్పుడు నా స్నేహితులతో నా సెక్స్ సామర్థ్యం గురించి తెగ చెప్పుకునేవాడిని. పెళ్లయ్యాక నలుగురైదుగురు పిల్లల్ని కంటానని గొప్పలు చెప్పేవాడిని. బాగా చదివి సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయ్యాను. పెళ్లి చేసుకున్నాను. ఐతే పెళ్లయ్యాక అక్కడ అసలు సంగతి బయటపడింది. నా భార్యతో నేను సంభోగంలో నాలుగైదు నిమిషాలు కూడా ఉండేది కాదు. ఐతే నా అసమర్థతను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేవాడిని కాదు.

కానీ రెండుమూడేళ్లు గడిచాక పిల్లలు కలుగలేదేమిటి అంటూ మా పెద్దలు గొడవ మొదలుపెట్టారు. దీనితో ఇద్దరం టెస్ట్ చేయించుకున్నాం. లోపం నాలోనే ఉంది. అప్పటినుంచి ఆరేళ్లుగా విడివిడిగా ఉంటున్నాం. అలా ఎందుకు... కృత్రిమ పద్ధతులు పాటించాలని నా భార్య చెపుతోంది. నాకు నచ్చడంలేదు. ఇలాంటి మార్గం కంటే ఆమెకు విడాకులు ఇస్తే పోతుందనిపిస్తుంది. అది కూడా ఇవ్వాలంటే ఏదో ఓ ఫీలింగ్....
 
మీరు ముందుగా మానసికంగా స్థిరంగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకోసం అవసరమైతే కౌన్సిలింగ్ తీసుకోండి. లోపం మీలోనే ఉన్నప్పుడు ఇక మీ అర్థాంగిని చిన్నచూపు చూడటం, విడాకులు ఇవ్వాలనుకోవడం కరెక్ట్ కాదు. ఇద్దరూ కూర్చుని మాట్లాడుకోండి. సంతానం కలిగినంత మాత్రానే దంపతుల సంతోషంగా ఉంటారనీ, లేకపోతే ఏదో కోల్పోతారనుకోవద్దు. సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నం చేయండి. ఒకవేళ అది సాధ్యం కాదని స్పష్టమైనప్పుడు బాలబాలికల ఆశ్రమంలో ఎవరినైనా దత్తత తీసుకుని జీవితాన్ని సాగించండి.