మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. మనస్తత్వ శాస్త్రం
Written By
Last Modified: ఆదివారం, 11 నవంబరు 2018 (20:18 IST)

నా స్నేహితురాలిని నా బోయ్ ఫ్రెండుకి పరిచయం చేశా... బాగా కనెక్ట్ అయిపోరేమోననిపిస్తోంది...

నేను గత రెండేళ్లుగా నా బోయ్ ఫ్రెండుతో డేటింగ్ చేస్తున్నాను. ఈమధ్య నా స్నేహితురాలిని నా బోయ్ ఫ్రెండ్ నేనూ ఉండే ఇంటికి తెచ్చాను. ఆమె రెండు గంటలే ఉంది. కానీ ఆ కొద్ది సమయంలోనే నా ప్రియుడు, నా స్నేహితురాలు చాలా క్లోజ్ అయిపోయారు. ఇప్పుడు పొద్దస్తమానం ఫోన్లలో మాట్లాడుకుంటున్నారు. ఈ విషయాన్ని నేను కనిపెట్టాను. 
 
ఓ రోజు నా బోయ్ ఫ్రెండుకు ఫోన్ చేస్తే అతడి ఫోన్ ఎంగేజ్‌లో ఉంది. నా గర్ల్ ఫ్రెండుకు చేస్తే ఆమెదీ అలాగే ఉంది. దీన్నిబట్టి వీరిద్దరూ ఫోన్లలో గంటలతరబడి మాట్లాడుకుంటున్నట్లు నాకు అర్థమైంది. వీరి వ్యవహారాన్ని బట్టి నా బోయ్ ఫ్రెండ్ నన్ను వదిలేసి ఆమెతో కనెక్ట్ అయిపోయాడేమోనని అనుమానంగా ఉంది. ఈ విషయాన్ని అతడిని నేరుగా అడగలేని పరిస్థితి. ఒకవేళ అతడు ఆమెతో సంబంధం పెట్టేసుకుంటే నేనేం చేయాలి...?
 
రెండేళ్లుగా డేటింగ్ చేస్తూ ఒకరికొకరు అర్థం చేసుకున్న తర్వాత కూడా అతడు మిమ్మల్ని వదిలేసి ఆ అమ్మాయితో వెళ్లిపోతాడని అనుకుంటే ఇక అతడితో ఎలాంటి సంబంధాలను కొనసాగించడం అనవసరం. దీనిపై ఇద్దరిలో ఎవర్ని నిలదీసినా మీకు పాజిటివ్ రెస్పాన్స్ రాదు కూడా. ఐనా కొన్ని విషయాల్లో, సంబంధాల్లో స్నేహితులను దూరంగా పెట్టాలి. అలా పెట్టనప్పుడు ఇలాంటి సమస్యలే వచ్చిపడుతాయి.