ఈ పారిజాత పుష్పం... సత్యభామకు ఎంతో ఇష్టం... కృష్ణ పరమాత్మ తెచ్చిన వృక్షం
పారిజాత వృక్షం, పుష్పం అనే పేర్లు చెబితే చటుక్కున మనకు గుర్తుకు వచ్చేది సత్యభామ-శ్రీకృష్ణుడు. పురాణాల్లో చెప్పిన ప్రకారం తన ఇష్టసఖి సత్యభామకు కృష్ణుడు పారిజాతాన్ని తెచ్చి ఇస్తాడు. ఈ పారిజాతం గురించి ప
పారిజాత వృక్షం, పుష్పం అనే పేర్లు చెబితే చటుక్కున మనకు గుర్తుకు వచ్చేది సత్యభామ-శ్రీకృష్ణుడు. పురాణాల్లో చెప్పిన ప్రకారం తన ఇష్టసఖి సత్యభామకు కృష్ణుడు పారిజాతాన్ని తెచ్చి ఇస్తాడు. ఈ పారిజాతం గురించి పెద్ద ఎపిసోడే ఉందనుకోండి. ఇంతకీ ఈ పారిజాతం సంగతి ఇప్పుడెందుకు చెపుతున్నారా అనుకుంటున్నారా... అక్కడికే వస్తున్నా.
శ్రీకృష్ణుడు ఇంద్రలోకం నుంచి తెచ్చి సత్యభామకి బహూకరించిన పారిజాత వృక్షం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బారబంకి జిల్లాలోని కింటూర్ గ్రామంలో ఉన్నదట. అక్కడ కనిపించే ఈ మహావృక్షం ప్రపంచంలోకెల్లా విలక్షణమైన వృక్షంగా శాస్త్రజ్ఞులు చెపుతున్నారు. దీని ప్రత్యేకత ఏమిటంటే... ఈ వృక్షం తన శాఖ ముక్కలు నుండి పునరుత్పత్తి గాని, పండ్లు గాని ఉత్పత్తి చేయదు మరి.
ప్రపంచంలోని ఏ ఇతర చెట్టుకు లేని ప్రత్యేకత ఈ వృక్షానికి ఉండటం గమనార్హం. ఇంకా ఈ చెట్టు విశిష్టతను చూస్తే... దిగువ భాగంలో ఈ చెట్టు ఆకులు చేతి ఐదు వేళ్ళను పోలి ఉంటాయి. పైభాగాన ఉండే ఆకులు ఏడు భాగాలుగా ఉంటాయి. పుష్పాలు చాలా అందంగా బంగారు రంగు - తెలుపు రంగులో కలిసి చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి.
జూన్-జూలై నెలల్లో వికసిస్తుండే ఈ వృక్షం వయసు సుమారు 1000 నుంచి 5000 సంవత్సరాలని చెపుతారు. ఈ వృక్షం మరో విశేషం ఏమిటో తెలుసా... దీని ఆకులు కానీ, శాఖలు కానీ ఎండిపోయి రాలవు. ఒకవేళ ఎండిపోతే అలాగే కుంచించుకుపోయి కాండంలో కలిసిపోతాయి. ఇదే పారిజాతం.