Daily Horoscope
✕

శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఆళ్వార్ తిరుమంజన సేవ..

Written By సెల్వి
Updated: బుధవారం, 13 సెప్టెంబరు 2023 (16:13 IST)
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి ఆలయంలో బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆళ్వార్ తిరుమంజన సేవను నిర్వహించారు. దీని కోసం 6 గంటల పాటు భక్తులకు దర్శనం నిలిపివేయడం జరిగింది. తిరుమలలో ఈ నెల 18వ తేదీ నుంచి 26వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం ఆలయాన్ని శుద్ధిచేసే ఆళ్వార్ తిరుమంజన సేవ జరిగింది. 
 
ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. సంవత్సరానికి నాలుగు సార్లు ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆచారం. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి వంటి పండుగలను పురస్కరించుకుని ఈ సేవను నిర్వహిస్తాం. ఈసారి బ్రహ్మోత్సవాల కోసం మంగళవారం ఆలయ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించామన్నారు. 
 
మంగళవారం ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు ఆలయ శుభ్రత కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు. ఆనంద నిలయం నుంచి బంగారు వాకిలి వరకు, ఆలయం మొత్తం ఈ సేవ జరిగింది. ఆళ్వార్ తిరుమంజన సేవకు అనంతరం స్వామి వారికి అభిషేక, అలంకరలు జరిగాయి. ఆపై భక్తులకు శ్రీవారి దర్శనం కలుగ జేశారు.  

అన్నీ చూడండి

బొద్దింక జనతా పార్టీకి ఖలిస్తాన్ ఉగ్రవాదుల నుంచి రూ. 9 కోట్లు?!!

సౌదీలో ఇద్దరు బంగ్లాదేశ్ పౌరులకు మరణశిక్ష, సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న వార్తల్లో వాస్తవం ఏంటి?

బొద్దింకలు సంధించే ప్రశ్నలకు ఆన్సర్ చెప్పాలి కదా? అన్నామలై కామెంట్స్

రాజకీయ పార్టీని నిలబెట్టడం అంత సులభం కాదు : ధనుష్ పొలిటికల్ ఎంట్రీపై టీవీకే నేతల కామెంట్స్

విజయసాయి రెడ్డి కొత్త పార్టీ ప్రారంభ ముహూర్తం ఫిక్స్..

అన్నీ చూడండి

21-10-2026 బుధవారం దిన ఫలాలు - బాకీలను చాకచక్యంగా వసూలు చేసుకోవాలి...

20-10-2026 మంగళవారం రాశి ఫలాలు - ఆర్థిక విషయాల్లో ఇతరుల మాటల్ని నమ్మొద్దు

19-10-2026 సోమవారం ఫలితాలు - ఆశించిన ఆశించిన పదవి దక్కకపోవచ్చు...

18-10-2026... ఆదివారం నాటి రాశి ఫలాలు- కుటుంబ అవసరాల కోసం ముందుగానే..?

18-10-2026 నుంచి 24-10-2026 వరకు వారఫలాలు - భార్యాభర్తల మధ్య చీటికీ మాటికీ కలహం

తర్వాతి కథనం
Show comments