శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 22 నవంబరు 2024 (18:55 IST)

శనివారం కాలాష్టమి: నల్ల శునకాలకు రొట్టెలు.. ఇప్పనూనెతో దీపం

Kalashtami
కాలాష్టమి పండుగ ప్రతి ఏడాది నవంబర్‌ నెలలో జరుపుకుంటారు. ఈ ఏడాది మార్గశీర్ష మాసంలోని శుక్ల పక్ష అష్టమి తిథి జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. ఈ తిథి నవంబర్‌ నెల 22 శుక్రవారం సాయంత్రం నుంచి మొదలైంది. ఈ తిథి నవంబర్ 23వ తేదీ శనివారం రాత్రి 7:56 గంటలకు వరుకు కూడా కొనసాగుతుంది. 
 
ఈ సమయంలో కాలభైరవుడిని పూజించడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. కాలాష్టమి రోజు కాల భైరవుడిని పూజించి ఏవైనా ఇనుప వస్తువులు దానం చేయడం వల్ల శత్రువుల నుంచి విముక్తి లభిస్తుంది. కాలాష్టమి రోజు భైరవుడిని పూజించి.. నల్ల శునకాలకు రోటీలు తినిపించడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. 
 
అంతేకాకుండా రోటీలు అందుబాటులో లేనివారు ఈ రోజు బ్రెడ్‌ను కూడా తినిపించవచ్చు. ఇలా చేస్తే ఈతిబాధలు దూరమవుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అష్టమి తిథి నాడు కాలభైరవునికి ఇప్పనూనెతో దీపం వెలిగిస్తే సమస్త దోషాలు తొలగిపోతాయని.. అప్పులు వుండవని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.