ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ttdj
Last Updated : గురువారం, 26 జనవరి 2017 (14:32 IST)

మహాభారతంలో హనుమంతుడు ఏం చేశాడో తెలుసా..?

రామాయణంలో హనుమంతుని పాత్ర గురించి అందరికీ బాగా తెలుసు? కానీ మహాభారతంలో హనుమంతుని పాత్ర గురించి కొందరికే తెలిసి ఉండవచ్చు. హనుమంతుడు రెండుసార్లు మహాభారతంలో కూడా కనిపిస్తాడని పురాణాలు చెబుతున్నాయి.

రామాయణంలో హనుమంతుని పాత్ర గురించి అందరికీ బాగా తెలుసు? కానీ మహాభారతంలో హనుమంతుని పాత్ర గురించి కొందరికే తెలిసి ఉండవచ్చు. హనుమంతుడు రెండుసార్లు మహాభారతంలో కూడా కనిపిస్తాడని పురాణాలు చెబుతున్నాయి.
 
హనుమాన్ చిరంజీవి. అందుచేత హనుమాన్ మహాభారతంలోనూ కనిపిస్తాడు. హనుమంతుడిని భీముడికి సోదరుడిగా చెబుతారు. ఇద్దరూ వాయుదేవుని కుమారులే. మహాభారతంలో హనుమంతుడు మొదటిసారి పాండవులు వనవాసం చేస్తున్నప్పుడు భీముడిని కలుస్తాడు. రెండవసారి హనుమాన్ కురుక్షేత్ర యుద్ధం జరుగున్నప్పుడు అర్జునుడి రథాన్ని రక్షిస్తూ రథం మీద ఉన్న జెండాలో ఉంటాడు.
 
మొదటిసారి హనుమంతుడు పాండవులు వనవాసం చేస్తున్నప్పుడు భీముడిని కలుస్తాడు. వనవాసం చేస్తున్నప్పుడు ద్రౌపది భీముడిని సౌగంధిక పువ్వుల కోసం బయలుదేరాడు. అతను వెళుతున్న మార్గంలో ఒక పెద్ద కోతి విశ్రాంతి తీసుకుంటూ అడ్డంగా పడుకుని ఉన్నది. భీముడు ముందుకు వెళ్ళడానికి కోతిని అడ్డు తొలగమని పదేపదే కోరాడు. కానీ ఆ కోతి, తానూ చాలా ముసలివాడినని, తోకను కూడా తొలగించలేని శక్తి హీనుడినని, అందువల్ల భీముడినే అడ్డు తొలగించుకుని వెళ్ళమని ప్రాధేయపడింది. అందువల్ల తప్పనసరిగా కోతి తోకను పక్కకు పెట్టి వెళ్ళాలి.
 
భీముడు కోతిపట్ల చులకనగా చూశాడు మరియు తన గదతో తోకను పక్కకు పెట్టడానికి ప్రయత్నించాడు. కానీ తోకను ఒక అంగుళం కూడా కదిలించకపోయాడు. భీముడు చాలా ప్రయత్నించిన తర్వాత ఈ కోతి సాధారణమైనది కాదని తెలుసుకున్నాడు. అందువల్ల భీముడు శరణు కోరడమే కాకుండా క్షమాపణ అడిగాడు. అప్పుడు హనుమంతుడు, తన అసలు రూపంలో వచ్చి భీముడిని ఆశీర్వదించాడు.
 
అర్జునుడి రథం మహాభారతంలో మరొక సంఘటనలో హనుమాన్ రామేశ్వరం వద్ద ఒక సాధారణ కోతి రూపంలో అర్జునుడిని కలుసుకున్నాడు. లంకకు వెళ్ళడానికి అర్జునుడు రాముడు నిర్మించిన వంతెన చూసి అర్జునుడు ఈ వంతెనను నిర్మించడానికి కోతుల సహాయం తీసుకున్నాడు. ఎందుకు! అని దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాడు. అదే తను అయితే ఒక్కడే ఈ వంతెనను బాణాలతో నిర్మించి ఉండేవాడినని అనుకున్నాడు.
 
హనుమాన్ వెటకారంగా నీ బాణంతో నిర్మించిన వంతెన అయితే సంతృప్తికరంగా ఉండేది కాదని, ఆ వంతెన ఒక వ్యక్తి బరువును మోసి ఉండేది కాదని విమర్శించాడు. అర్జునుడు దీనిని ఒక సవాలుగా తీసుకున్నాడు. అర్జునుడు తాను నిర్మించిన వంతెన సంతృప్తికరంగా లేదంటే అప్పుడు తాను అగ్నిలో దూకుతానన్నాడు. దీంతో అర్జునుడు తన బాణాలతో ఒక వంతెన నిర్మించారు. హనుమాన్ దానిపై కాలు మోపగానే ఆ వంతెన కూలిపోయింది. అర్జునుడు నిశ్చేష్టడయ్యాడు. తన జీవితం అంతం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు కృష్ణుడు అర్జునుని ముందు ప్రత్యక్షమైన ఆ వంతెనను తన దివ్య స్పర్శతో పునర్నిర్మించాడు. అప్పుడు దానిపై పాదం మోపమని హనుమంతుడిని కోరాడు. ఈసారి వంతెన కూలిపోలేదు. అందువల్ల హనుమాన్ అతని అసలు రూపంలో ప్రత్యక్షమైన జరుగబోయే యుద్ధంలో అర్జునుడికి సహాయం చేస్తానని వాగ్ధాంనం చేశాడు.
 
అందుకే కురుక్షేత్రం యుద్ధం సంభవించినప్పుడు హనుమంతుడు అర్జునుని రథ జెండాపై యుద్ధప్రారంభం నుంచి ముగిసే వరకు ఉన్నాడు. కురుక్షేత్ర యుద్ధం చివరి రోజున, కృష్ణుడు యుద్ధం అంతం వరకు హనుమంతుడు అక్కడ ఉన్నందుకు ధన్యవాదాలు తెలిపాడు. అప్పుడు హనుమంతుడు వంగి నమస్కరించడమే కాకుండా రథం వదిలి వెళ్ళాడు. హనుమంతుడు వెళ్ళిన వెంటనే రథం అగ్నికి ఆహుతి అయ్యింది. ఇదంతా వీక్షించిన అర్జునుడు ఆశ్చర్యపోయాడు. అప్పుడు కృష్ణుడు ఇప్పటివరకు హనుమంతుడు రక్షించడం వల్ల ఈ దివ్యమైన ఆయుధాలు ఏమీ చేయలేకపోయాయి. లేనట్లయితే ఎప్పుడో రథం అగ్నికి ఆహుతి అయి ఉండేదన్నాడు. కాబట్టి హనుమంతుడు రామాయణంలో మాత్రమే కాదు కానీ మహాభారతంలో కూడా ఒక కీలకమైన పాత్ర పోషించాడట.