శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By chj
Last Modified: శుక్రవారం, 3 ఆగస్టు 2018 (18:00 IST)

శ్రీవిష్ణు సహస్ర నామాలలో ఏముంది?

దుష్టశిక్షణ- శిక్షరక్షణ కోసం శ్రీమహావిష్ణువు తన ప్రియమైన భక్తులకోసం దశావతారాలలో అవతరించి ఈ లోకానికి శాంతిని ప్రసాదించాడు. విశ్వస్వరూపుని ఈ గుణగుణాలను కీర్తిస్తూ శ్రీ విష్ణుసహస్రనామంలో వివరించడం జరిగింది. కలియుగదైవంగా ఆదర్శప్రాయుడై నిలచిన శ్రీ మహావిష్

దుష్టశిక్షణ- శిక్షరక్షణ కోసం శ్రీమహావిష్ణువు తన ప్రియమైన భక్తులకోసం దశావతారాలలో అవతరించి ఈ లోకానికి శాంతిని ప్రసాదించాడు. విశ్వస్వరూపుని ఈ గుణగుణాలను కీర్తిస్తూ శ్రీ విష్ణుసహస్రనామంలో వివరించడం జరిగింది. కలియుగదైవంగా ఆదర్శప్రాయుడై నిలచిన శ్రీ మహావిష్ణువు సకల సృష్టికి స్థితిలయ కారకుడిగా ఏకైక పరమాత్ముడిగా నిలిచాడు. అందుకు ఆయనను మనం నిత్యం భక్తిశ్రద్దలతో ఆరాధించాలి. మనసారా ధ్యానించాలి. శ్రీహరి నామాలు ఎన్నో ఉన్నాయి. 
 
శ్రీ మహావిష్ణువు దశావతారాల వైశిష్ట్యం గురించి శ్రీవిష్ణు సహస్రనామంలో విపులంగా వివరించారు. శ్రీ విష్ణుసహస్రనామంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. దీనిని క్రమంతప్పకుండా భక్తిశ్రద్ధలతో పఠించడం వల్ల సర్వకార్యాలు సిద్ధిస్తాయి. సిరులు, సౌభాగ్యాలు సమృద్ధిగా లభిస్తాయి. శ్రీ మహాలక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. విద్యార్థులు సైతం ఈ స్తోత్రం పఠించడం వల్ల విజయం సాధించగలరు.
 
ముఖ్యంగా విష్ణు సహస్రనామంలో...
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే...
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే....
అనే శ్లోకం మూడుసార్లు పఠించే నియమం ఆచరణలో ఉంది. శ్రీ విష్ణు సహస్రనామంలో సైతం శ్రీరామ నామ మహిమ ఎంత గొప్పదో మనం ఊహించవచ్చు. భీష్మ ఉవాచగా ప్రారంభమయ్యేటువంటి శ్రీ విష్ణుసహస్రనామం విశ్వం పదంతోనే ప్రారంభం కావడం విశేషం. కాగా, విశ్వ శాంతికి సైతం ఎంతో మంచిదంటారు.
 
విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ప్రభుః.... అంటూ ఆరంభం అవుతుంది.
సకల లోక రక్షకుడు అయినటువంటి శ్రీ మహావిష్ణువు మనకు శరణాగతుడు అన్న అంశాన్ని శ్రీ విష్ణుసహస్రనామంలో వివరించారు. కురుక్షేత్ర సంగ్రామంలో నారయణాంశ అయిన అర్జునుడు ధర్మ మార్గాన నిలచి విజేత అయ్యాడు. కానీ అధర్మం వైపు యుద్ధం చేసి వీర మరణం పొందిన భీష్మాచార్యుడు ఆత్మజ్ఞాని అయ్యాడు. అంపశయ్య నుండే భీష్మాచార్యుడు అర్జునాది మానవాళికంతటికి విష్ణు సహస్రనామం ద్వారా ఆత్మ సందేశం అందించి ఆదర్శప్రాయుడయ్యాడు. భీష్ముడు ఆత్మజ్ఞాని కనుకనే ఆ మహాపురుషుని వ్యక్తిత్వం గ్రహించిన శ్రీకృష్ణుడు గీతాభోదలో అర్జునుడికి ఈ విషయం తెలియజేశాడు.
 
సాక్షాత్తు శ్రీకృష్ణుడే భీష్మాచార్యుని వ్యక్తిత్వం, ఔన్నత్యం గుర్తించాడంటే భీష్ముడెంతటి పుణ్యాత్ముడో మనం ఇట్టే గ్రహించవచ్చు. అటువంటి మహనీయుల సైతం విష్ణుసహస్రనామం పారాయణం చేశారు. శ్రీ విష్ణుసహస్రనామ పారాయణ వల్ల కార్యసిద్ధి, ఆరోగ్య సిద్ధి, పుణ్యఫలం, సౌభాగ్యసిద్ధి ప్రాప్తించగలవు. శ్రీ విష్ణు సహస్రనామం గురించి పవిత్ర వేదశాస్త్రాలలో సైతం వివరించారు. సకల శుభాలు చేకూర్చే శ్రీ విష్ణుసహస్రనామం ఎంతో మధురమైనది.