సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: ఆదివారం, 9 ఆగస్టు 2020 (17:25 IST)

గోసేవ సర్వపాప హరణం... ఆవు పాలతో అవన్నీ...

గోవుకి ప్రదక్షిణం చేస్తే సాక్షాత్తూ 33 కోట్ల దేవతలకు ప్రదక్షిణం చేసినట్లేనని పురాణాలు చెపుతున్నాయి. గోవులకు సేవ చేయడం వల్ల ఎన్నో జన్మల పాపాలు నశిస్తాయి. మంచి సంతానం కలుగుతుంది. సులభంగా దైవానుగ్రహం లభిస్తుంది. అష్టైశ్వర్యాలు కలుగుతాయి. 
 
ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు మూత్రం, ఆవు పేడ.. ఈ ఐదింటిని కలిపి పంచగవ్యాలు అంటారు. ఆవుపాలు తల్లిపాలతో సమానం. ఆవు పాలతో స్వామికి చేయించే స్నానం అష్టైశ్వరఫలం. ఆవు నెయ్యి బుద్ధి బలాన్ని పెంచుతుంది. ఆవు పాలలో విషాన్ని హరించే శక్తి వుంది. అపవిత్రమైన స్థలంలో గోమూత్రంతో శుద్ధి అవుతుంది. గోమయంతో అలికిన ఇంట్లో లక్ష్మీదేవి నివశిస్తుంది.