సంపద కోరేవారు.. తులసీ దళాలు.. అవిసె పుష్పాలతో పూజిస్తే?
సంపద కోరేవారు బిల్వపత్రం, కమలం, శతపత్రం, శంఖ పుష్పములతో శివుడిని పూజించాలి. భోగభాగ్యాల మోక్షం కోసం తులసి దళాలతో.. ఎర్ర తెల్ల జిల్లేడు, శ్వేత కమలాలతో పూజించాలని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. అలాగే సుఖసంపదలు పారిజాతపుష్పాలతో పూజించాలి. అవిసె పుష్పాలతో పూజిస్తే విష్ణు భగవానుణ్ణి ప్రసన్నం చేసుకోవచ్చునట. ఇంకా ఆయన అనుగ్రహం లభిస్తుందని వారు చెప్తున్నారు.
మోక్షం కోరేవారు దర్భలతో, శమీ పత్రములతో, వర్తమాన ఋతువులో పుట్టిన పుష్పములతో పూజించాలి. దీర్ఘాయువు కోరేవారు దూర్వారముతో పూజ చేస్తే మంచిది. సుపుత్రుడు జన్మించాలని కోరుకునేవారు ఉమ్మెత్త పూలతో పూజించాలి. వాహన కోరికను నెరవేర్చుకునేందుకు జాజిపూలతో పూజించాలి.
రోగ నివారణకు గన్నేరుతో పూజించాలి. శుభలక్షణసంపన్నమైన భార్యను కోరువారు మల్లెలతో విష్ణువును పూజించాలి. సంపెంగ, మొగలి పుష్పాలు తప్ప మిగతా పుష్పములన్నీ శివుడికి సమర్పించవచ్చునని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.