అదీ అమరితే మరొకటి కావాలని ఆత్రపడతాడు

ఆశ లేని జీవితం గింజ కట్టని పొల్లు వెన్ను లాంటిది. అత్యాశ ఉన్న జీవితం విరగ కాసిన చెట్టు లాంటిది. వాస్తవానికి సృష్టిని నడిపించే ఇంధనం-ఆశ. తగు మోతాదులో వినియోగిస్తేనే జీవిత నౌక సాఫీగా సాగుతుంది. పోటీపడే వారంతా విజేతలు కావాలనే ఆశిస్తారు. గెలిచేది ఒక్కరే

గురువారం, 6 సెప్టెంబరు 2018 (21:52 IST)
ఆశ లేని జీవితం గింజ కట్టని పొల్లు వెన్ను లాంటిది. అత్యాశ ఉన్న జీవితం విరగ కాసిన చెట్టు లాంటిది. వాస్తవానికి సృష్టిని నడిపించే ఇంధనం-ఆశ. తగు మోతాదులో వినియోగిస్తేనే జీవిత నౌక సాఫీగా సాగుతుంది. పోటీపడే వారంతా విజేతలు కావాలనే ఆశిస్తారు. గెలిచేది ఒక్కరే అయినా పోటీపడటం మానరు. గెలవలేమేమో అనే నిరాశ వారిలో తలెత్తనే కూడదు. అలాగే అర్హత, స్థాయి, స్థోమత లేని వాటికోసం ఆశ పడటం అనర్ధదాయకం. ఆశకు అంతుండదంటారు అనుభవజ్ఞులు. అనంతమైన ఆశ తన వెంట పడే వారిని పరుగులు పెట్టిస్తుంది. 
 
పరుగెత్తేకొద్దీ తీరిక లేకుండా చేసి ఇంకా తనవైపు ఆకర్షితుల్ని చేయడం దాని లక్షణం. ఆశించింది దొరికితే మరికొంత కావాలని మనిషి కోరుకుంటాడు. అదీ అమరితే మరొకటి కావాలని ఆత్రపడతాడు. అంతేతప్ప ఇక్కడితో ఆగుదాము అనుకోడు. ప్రమిదలో వత్తి లాంటిది ఆశ. అది ఉండేంతవరకు చమురు పోస్తే వెలుగునిస్తుంది. మునిగేంతగా పోస్తే, చీకటినే మిగుల్చుతుంది. ఆశ మనిషికి లోబడి ఉండాలి. కానీ మనిషి ఆశకు లోబడిపోకూడదు. ఆశ లేనివారికి దుఃఖ బాధలుండవు. ఆశ పడే వారికి లేని బాధ లుండవు. 
 
తమకున్నదానితో సంతృప్తి పడేవారు సంతోషం చవిచూస్తారు. అలా కానివారు కోల్పోతారు. అవగాహన, ప్రణాళిక, పట్టుదల, తగిన కృషి ఉంటే ఆశలు వాటంతట అవే నెరవేరతాయి. ఆశ అనేక రూపాలలో ఉంటుంది. మనిషి నిరాశ, అత్యాశ, దురాశల్లో కూరుకుపోవడం మంచిది కాదు. నిరాశ అతణ్ని నిర్వీర్యుడిగా చేస్తుంది. నిరాశ ఉందని గుర్తించిన తర్వాత ఏదో ఒక విధంగా దానిని తొలగించుకోవాలి. ఆ స్థానంలో ఆశావహ దృక్పధం పెంచుకోవాలి. 
 
అత్యాశ కలిగిన వాళ్లు సుఖసంతోషాలకు దూరమవుతారు. దురాశ వల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయి. చెడు ఆశల మూలాన వాటిల్లే అనర్ధాలకు విరుగుడు లేదు. లోకంలో అసంతృప్తికి మించిన దారిద్ర్యం లేదు. సంతృప్తిపరుడు పొందే సుఖాన్ని ఎంతటి చక్రవర్తి అయినా పొందలేడు.  ఆశలు మనసులో ఉండాలి. వాటిని నెరవేర్చుకునే ఆలోచనలు మెదడులో ఉండాలి. వాటిని ఫలవంతం చేసుకునే కృషి, మనిషి చేతుల్లో ఉండాలి.

అన్నీ చూడండి

Monsoon rains, పాతబస్తీలో విద్యుత్ తీగలు తెగి తగలడంతో ఇద్దరు యువకులు మృతి

సీఎం విజయ్ కేబినెట్ మహిళా మంత్రిపై యూట్యూబర్ మారిదాస్ అసభ్యకర వీడియో?: అతడు బైటకు రావడం కష్టమేనా?

బిర్యానీ విషయంలో గొడవ: దంపతుల ఆత్మహత్య.. నాలుగేళ్ల కుమారుడి ముందే..?

Minor girl: మైనర్ బాలికపై అత్యాచారం.. ఆపై భవనం పైనుంచి కిందకు తోసేశాడు..

కుక్క కరిచిన వ్యక్తి ఎలా అయిపోయాడో చూడండి, వీడియో

అన్నీ చూడండి

10-06-2026 బుధవారం ఫలితాలు- విశేష ఫలితాలున్నాయి

Positive Energyని నాశనం చేసే రాక్షస స్నానం, ఏమిటి ఈ స్నానం?

09-06-2026 మంగళవారం ఫలితాలు - చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తథ్యం...

మృగశిర కార్తె అంటే ఏంటి విశేషం.. ఇంద్రుడు ఎంత వైభోగంగా ఉంటాడో..?

08-06-2026 సోమవారం ఫలితాలు - లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం...

తర్వాతి కథనం
Show comments