శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By chj
Last Modified: బుధవారం, 1 మార్చి 2017 (21:56 IST)

తులసి మొక్క ఎండిపోతే ఏం చేయాలి?

భారతీయ సనాతన జీవన విధానంలో అనాదిగా తులసి మొక్క భాగమైపోయింది. హిందువులు తులసి మొక్కను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. పూజల కోసమే కాకుండా, ఆరోగ్యం పరంగానూ తులసి ఆకులను వివిధ ఔషదాల్లో ఉపయోగిస్తారు. చాలామంది ఇళ్లలో తులసి మొక్కకు కోటను నిర్మించి నిత్యం పూజలు

భారతీయ సనాతన జీవన విధానంలో అనాదిగా తులసి మొక్క భాగమైపోయింది. హిందువులు తులసి మొక్కను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. పూజల కోసమే కాకుండా, ఆరోగ్యం పరంగానూ తులసి ఆకులను వివిధ ఔషదాల్లో ఉపయోగిస్తారు. చాలామంది ఇళ్లలో తులసి మొక్కకు కోటను నిర్మించి నిత్యం పూజలు చేస్తుంటారు. ప్రతిరోజు తులసమ్మకు నమస్కరించి చెట్టును తాకితే శుభప్రదం అని పెద్దలు చెబుతుంటారు. తులసీ మొక్క ఇంట్లో ఉంచుకోగానే సరికాదు. తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి. తులసి మొక్క ఆకులను ఎప్పుడు పడితే అప్పుడు తాకకూడదు, తెంపకూడదు.
 
తులసి ఆకులను ఏకాదశి రోజు, రాత్రి సమయంలో, ఆదివారాలు తెంపకూడదు. అలాగే గ్రహణ సమయాల్లో ఈ ఆకులను తెంపడం అరిష్టం. తులసి మొక్క వద్ద దీపం ఉంచి రోజూ పూజలు చేయాలి, ఆకుల్ని తెంపే సమయంలో ముందుగా తులసిని అనుమతి తీసుకున్న తర్వాత మాత్రమే తెంపాలి. తులసి ఆకులను నోట్లో వేసుకుని నమలకూడదు. ఎందుకంటే వాటి ఆకుల్లోని యాసిడ్ దంతాలకు హాని చేస్తుంది. కాబట్టి నీళ్లలో లేదా టీలో తులసి ఆకులను కలిపి తీసుకోవాలి. 
 
ఆరోగ్య లేదా మతపరమైన అవసరాలకే తులసి ఆకులను తెంపాలి. అకారణంగా వాటిని తుంచడం పాపం. ఎండిపోయిన తులసి ఆకులు రాలితే, వాటిని ఊడ్చివేయకూడదు. వాటిని ఆ మొక్క సమీపంలోనే గుంత తీసి పూడ్చాలి. తులసి మొక్క ఎండిపోతే దాన్ని పడేయకూడదు. దాన్ని పుణ్య నదీ జలాల్లో లేదా చెరువులోగానీ వేయాలి. ఎండిపోయిన తులసి చెట్టు ఇంట్లో ఉండటం మంచిది కాదు.