శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 29 నవంబరు 2016 (17:21 IST)

వేమన పద్యాలు : 'ఆత్మశుద్ధిలేని యాచార మదియేల'...

"ఆత్మశుద్ధిలేని యాచార మదియేల భాండశుద్ధి లేని పాకమేల? చిత్తశుద్ధిలేని శివపూజ లేలరా? విశ్వదాభిరామ వినురవేమ"

"ఆత్మశుద్ధిలేని యాచార మదియేల 
భాండశుద్ధి లేని పాకమేల?
చిత్తశుద్ధిలేని శివపూజ లేలరా?
విశ్వదాభిరామ వినురవేమ"
 
భావం : మనసు నిర్మలంగా లేకుండా దుర్బుద్ధితో చేసే అచారం ఎందుకు? వంట పాత్ర శుభ్రంగా లేని వంట ఎందుకు? అపనమ్మకంతో దూరాలోచనతో చేసే శివ పూజ ఎందుకు అని అర్థం.