ఆదివారం, 12 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : గురువారం, 5 నవంబరు 2020 (18:00 IST)

కార్తీక మాసంలో పరమేశ్వరుడిని ఈ పదార్థాలతో అభిషేకం చేస్తే? (video)

కార్తీక మాసం రాబోతోంది. ఈ కార్తీకంలో పరమేశ్వరుని పూజించివారి కోరిన కోర్కెలు తీరుతాయని విశ్వాసం. పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు. ఈ క్రింది పదార్థాలతో శివుడికి అభిషేకం చేయడం వల్ల మన అభీష్టాలు నెరవేరుతాయి. ఏ పదార్థాలతో శివుడికి అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితాన్ని పొందుతారో చూద్దాం.
 
1. మెత్తని చెక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును.
 
 
2. మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును.
 
3. తేనెతో అభిషేకించిన తేజోవృద్ది కలుగును.
 
4. పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును.
 
5. కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును.
 
6. రుద్రాక్ష జలాభిషేకముతో సకల ఐశ్వర్యములనిచ్చును.
 
7. భస్మాభిషేకంచే మహా పాపాలు నశించును.
 
8. గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును.
 
9. గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.
 
10. నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.
 
11. ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును.
 
12. పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును.
 
13. ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును
 
14. చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును