యాంకర్ కత్తి కార్తీకపై కేసు నమోదు, ఏం చేసింది?

Karthika
శ్రీ| Last Modified శుక్రవారం, 16 అక్టోబరు 2020 (17:48 IST)
యాంకర్ కత్తి కార్తీకపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. ఒక ల్యాండ్ ఇష్యూ సెటిల్ చేస్తా అంటూ కోటి రూపాయల మోసానికి కార్తీక, ఆమె అనుచరులు పాల్పడ్డారని పోలీసులకు పిర్యాదు చేసాడు బాధితుడు.

అమీన్‌పూర్ వద్ద 52 ఎకరాల భూమిని ఒక ప్రైవేట్ కంపెనీకి ఇప్పించేందుకు కార్తీక మధ్యవర్తిత్వం వహించి బాధితుడి దగ్గర కోటి రూపాయలు సెక్యూరిటీగా కార్తీక రెడ్డి, ఆమె అనుచరులు డిపాజిట్ చేయించుకున్నారని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు. దీనితో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.దీనిపై మరింత చదవండి :