శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 15 అక్టోబరు 2020 (12:32 IST)

తెలంగాణాలో తగ్గిన కరోనా కేసులు.. దేశ వ్యాప్తంగా ఎన్ని?

తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ గురువారం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 1,432 కేసులు నమోదయ్యాయి. అదేసమయంలో 8 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1,949 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,17,670 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,93,218 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,249కు చేరింది. ప్రస్తుతం 23,203 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. 19,084 మంది హోం క్వాంరంటైన్‌లో చికిత్స పొందుతున్నారు. బుధవారం ఒక్కరోజులో తెలంగాణ వ్యాప్తంగా 38,895 కరోనా పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు తెలంగాణలో మొత్తం 37,03,047 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు.  
 
ఇకపోతే, దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 73 లక్షలు దాటింది. భారత్‌లో గత 24 గంటల్లో 67,708 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 73,07,098 కి చేరింది.
 
గ‌త 24 గంట‌ల సమయంలో 680 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,11,266 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 63,83,442 మంది కోలుకున్నారు. 8,12,390 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.  
 
కాగా, దేశంలో బుధవారం వరకు మొత్తం 9,12,26,305 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 11,36,183 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.