శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 14 అక్టోబరు 2020 (17:43 IST)

హైదరాబాద్‌లో భారీ వర్షాలు బీభత్సం.. జలదిగ్భందంలో 1500 కాలనీలు

హైదరాబాద్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నగరంలో దాదాపు 1500 కాలనీలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. అన్ని చోట్లా ఇళ్లలోకి నీరు చేరింది. అమీర్‌పేట్‌ అయోధ్య కాలనీలోకి వరద నీరు పోటెత్తింది. వందలాది ఇళ్లు నీట మునిగాయి. నిత్యావసర సరుకులు కొట్టుకుపోయాయి. వరద గుప్పిట చిక్కుకున్న తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
 
బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. ఎస్‌బీహెచ్ కాలనీలో ఓ అపార్ట్‌మెంట్ సెల్లార్‌లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. సెల్లార్‌లో ఉన్న నీటిని బయటకు పంపించేందుకు.. డాక్టర్ సతీష్ రెడ్డి మోటార్ వేసేందుకు వెళ్లారు.
 
మోటార్ వేస్తుండగా విద్యుత్ షాక్‌తో డాక్టర్ మృతి చెందారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. హైదరాబాద్‌లో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున.. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.