ఆ ఆలయంలోకి వెళ్లాలంటే.. పురుషులకు చీరకట్టు, లిప్‌స్టిక్‌ తప్పనిసరి..

సుప్రసిద్ధ ఆలయాల్లో మహిళలు, పురుషులు సంప్రదాయ దుస్తులు ధరించాలనే నియమం వుంటుంది. కానీ ఆ ఆలయంలోకి పురుషులు ఆడవారిలా తయారయ్యాకే అడుగు పెట్టాలనే నియమం వుంది. లిప్ స్టిక్, పువ్వులు పెట్టుకుంటేనే ఆ దేవాలయం

selvi| Last Updated: శుక్రవారం, 16 ఫిబ్రవరి 2018 (13:13 IST)
సుప్రసిద్ధ ఆలయాల్లో మహిళలు, పురుషులు సంప్రదాయ దుస్తులు ధరించాలనే నియమం వుంటుంది. కానీ ఆ ఆలయంలోకి పురుషులు ఆడవారిలా తయారయ్యాకే అడుగు పెట్టాలనే నియమం వుంది. లిప్ స్టిక్, పువ్వులు పెట్టుకుంటేనే ఆ దేవాలయంలోకి పురుషులను అనుమతిస్తారు. ఆ ఆలయం కేరళలోని కొల్లం జిల్లాలో వుంది. ఈ దేవాలయం పేరు కొట్టాన్ కొల్లారా ఆలయం.

చాలాకాలం పాటు ఈ ఆలయంలో ఈ ఆచారం వుంది. ఈ ఆలయంలోకి పురుషులకు అనుమతి ఇవ్వరు. కానీ ఈ దేవాలయంలోకి వెళ్లాలనుకున్న పురుషులు అచ్చం మహిళల్లో కట్టుకుని ముస్తాబు కావాల్సి వుంటుంది. కంటికి కాటుక, పెదవులకు లిప్ స్టిక్, పువ్వులు పెట్టుకుని రావాలి. స్త్రీల తరహాలో పురుషులు అలంకరించుకునేందుకు ఆలయ పరిసరాల్లో తగినన్నీ ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఆరోగ్యం, వివాహం, విద్య, ఉద్యోగం వంటి అంశాలపై మొక్కుకున్న వారు అమ్మవారిని వేడుకుంటారు. ఆ ఆచారం వెనుక వున్న ఎన్నో కథలున్నాయి. ఓసారి పశువుల కాపరులు చీరలు ధరించి దగ్గరిలోని ఓ రాయికి పూజలు చేస్తే.. ఆ రాయిలో దైవశక్తిని గమనించారు. తర్వాతి కాలంలో ఆ రాయిని కొట్టన్ అని పిలిచి దాని చుట్టూ గుడి కట్టారు.

అప్పటి నుంచి పురుషులు స్త్రీల వేషధారణలో ఈ ఆలయంలో పూజలు చేయడం జరుగుతోంది. అలాగే ఓ సారి కొబ్బరికాయను ఆ రాయికేసి కొట్టడంతో అందులోనుంచి రక్తం వచ్చినట్లు చెప్తారు. అప్పటి నుంచి ఆ రాయికి పూజలు చేయడం ప్రారంభమైనాయని.. అంతేగాకుండా ఆ రాయి పరిమాణం కూడా పెరుగుతూ వుంటుందని ఆలయ నిర్వాహకులు వెల్లడించారు.దీనిపై మరింత చదవండి :