శనివారం, 9 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By TJ
Last Modified: బుధవారం, 28 జూన్ 2017 (13:19 IST)

తిరుమలకు నడిచి ఎక్కిన గోవు - సునాయాసంగా 2 వేల మెట్లు....

తిరుమల శ్రీవారి మహత్యం అంతాఇంతా కాదు. ఎందెందు వెతికినా అందదు కలడు అని శ్రీవారిపై రాసిన పాటలు ఎప్పటికీ చిరస్మరణీయమే. అయితే అలాంటి స్వామివారి లీలలు ఒక్కొక్కటిగా కనిపిస్తుంటాయి. సాధారణంగా తిరుమలకు కాలినడకన వెళ్ళాలంటే కొద్దిగా ఇబ్బందులు తప్పవు. కాళ్ళ నొప

తిరుమల శ్రీవారి మహత్యం అంతాఇంతా కాదు. ఎందెందు వెతికినా అందదు కలడు అని శ్రీవారిపై రాసిన పాటలు ఎప్పటికీ చిరస్మరణీయమే. అయితే అలాంటి స్వామివారి లీలలు ఒక్కొక్కటిగా కనిపిస్తుంటాయి. సాధారణంగా తిరుమలకు కాలినడకన వెళ్ళాలంటే కొద్దిగా ఇబ్బందులు తప్పవు. కాళ్ళ నొప్పులనేవి సహజంగా వస్తుంటాయి. మానవులకే ఇన్ని ఇబ్బందులైతే ఇక జంతువుల విషయం చెప్పాలా. అలాంటిది జంతువులు మెట్లు ఎక్కి తిరుమలకు వెళితే...? జంతువులు వెళ్ళడం ఏంటి అనుకుంటున్నారా...
 
తిరుపతి సమీపంలోని శ్రీవారి మెట్టు మార్గం నుంచి ఒక గోవు 2300 మెట్లను సునాయాసంగా ఎక్కి తిరుమలకు చేరుకుంది. కాలినడక మార్గంలోనే భక్తులతో కలిసి గోవు ఎక్కింది. గోవును చూసిన భక్తులు ఆశ్చర్యపోయి ఆ గోవుకు కుంకుమ బొట్లు పెట్టారు. కొంతమంది గోమాతకు నమస్కరించారు. మరికొంతమంది అరటిపండ్లు, కొన్ని పండ్లను ప్రసాదంగా ఇచ్చారు. 
 
ఒక గోవు మెట్లు ఎక్కి తిరుమలకు వెళ్ళడం ఏమిటో ఇప్పటికీ ఎవరికీ అర్థం కాలేదు. తిరుమలకు వెళ్ళిన గోవును టిటిడి అధికారులు గుర్తించి ఆ గోవును తిరుమలలోని గోశాలకు తరలించారు. గోవుకు సరిపడా మేతను అందిస్తున్నారు టిటిడి అధికారులు. గోశాలలోని గోవును చూసేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.