Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలకు క్యూ కట్టిన భక్తులు.. కనిపించని సామాజిక దూరం!!

Written By ఠాగూర్
Updated: గురువారం, 11 జూన్ 2020 (11:39 IST)
కలియుగ వైకుంఠంగా భావించే తిరుమల పుణ్యక్షేత్రానికి భక్తులు క్యూ కట్టారు. కరోనా లాక్డౌన్ కారణంగా ఈ ఆలయంలోకి భక్తుల ప్రవేశాన్ని నిలిపివేశారు. అయితే, కేంద్రం లాక్డౌన్ ఆంక్షలు సడలించడంతో తిరిగి దర్శనం పునఃప్రారంభమైంది. దీంతో భక్తులు ఒక్కసారిగా క్యూకట్టారు. 
 
తమ ఇష్టదైవమైన శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. దీంతో తిరుపతిలోని అలిపిరిలోని బాలాజీ లింక్ బస్టాండ్, శ్రీనివాసం, విష్ణునివాసం ప్రాంతాల్లో దర్శన సమయ టోకెన్లను జారీ చేయడం మొదలైంది. దీంతో వేల మంది భక్తులు పోటెత్తారు. 
 
స్థానికులు పెద్ద సంఖ్యలో టోకెన్ జారీ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా భక్తులెవరూ భౌతిక దూరం పాటించక పోవడంతో అధికారులు తలపట్టుకున్నారు. అలిపిరి లింక్ బస్టాండులో భక్తులను టీటీడీ సిబ్బంది దూరదూరంగా కూర్చోబెట్టారు. 
 
బుధవారం సాయంత్రానికే ఈ నెల 14 వరకూ 15 వేల టోకెన్లను జారీ చేశారు. మొదట ఒక రోజుకు సరిపడా 3,700 టోకెన్లు ఇవ్వాలని భావించినా, భక్తులు వేల సంఖ్యలో రావడంతో దాదాపు 15 వేలకు పైగా టోకెన్లను జారీ చేశారు. ఇక నేడు మరో మూడు రోజులకు సరిపడినన్ని టోకెన్లు ఇస్తామని అధికారులు తెలిపారు.
 
కాగా, అలిపిరి వద్దకు వచ్చే భక్తుల వద్ద ఉన్న దర్శన సమయం టోకెన్ పరిశీలించి, థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించిన తర్వాతనే కొండపైకి అనుమతిస్తున్నారు. తొలి రోజున శరీర ఉష్ణోగ్రత అధికంగా ఉన్న సుమారు 300 మంది భక్తులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. టికెట్‌తో పాటే తిరుమలలో గదిని కూడా కేటాయించే సదుపాయాన్ని కల్పించామని అధికారులు తెలిపారు. 

అన్నీ చూడండి

ఏయ్ దూరం పాటించు అని చెప్పిన మహిళా బైకర్‌ను కారుతో ఢీకొట్టాడు, వీడియో

మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజార్‌ను పట్టిస్తే 70 లక్షల పాక్ రూపాయలు

మహిళతో వివాహేతర సంబంధం - రూ.29 కోట్ల నిధుల దుర్వినియోగం - అరెస్టు

ఖైరతాబాద్ గణేశుడికి గవర్నర్ తొలి పూజ... సీఎం చంద్రబాబు నివాసంలో చవితి వేడుకలు

మద్యం మత్తులో మహిళా బైకరును వేధించిన అకతాయిలు..

అన్నీ చూడండి

ఆ భయమే మనిషి మనశ్శాంతిని హరించివేస్తుంది: శ్రీ కృష్ణ పరమాత్మ

#HappyVinayakaChavithi : వినాయక చవితి వ్రత కథ - గణపతి జననం

13-09-2026 ఆదివారం మీ రాశి ఫలితాలు.. ఆర్థిక నిర్ణయాల్లో తొందరపడకుండా...?

13-09-2026 నుంచి 19-09-2026 వరకు వార ఫలితాలు.. ఏ రాశికి లాభం..

12-09-2026 శనివారం మీ రాశి ఫలితాలు.. ఆర్థిక స్థిరత్వంపై దృష్టి పెట్టాలి

తర్వాతి కథనం
Show comments