శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 2 జూన్ 2020 (14:26 IST)

శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శనానికి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్

శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. కలియుగ వైకుంఠం తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామిని భక్తులు దర్శించుకోవచ్చు. ఈ నెల 8 నుంచి నిబంధనలతో కూడిన దర్శనాలకు టీటీడీ అమమతి ఇచ్చింది. మొదటగా టీటీడీ ఉద్యోగులు, స్థానికులతో ట్రయల్ రన్ నిర్వహించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
 
రోజుకు పదివేల మందికి 16 గంటల నుంచి 18 గంటల వరకు అనుమతి ఇవ్వనున్నట్లు సమాచారం. గంటకు 500 మందిని దర్శనానికి అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. తిరుమల,తిరుపతిలో ఉన్న స్థానికులకు రెండు వారాల పాటు దర్శనానికి ఇవ్వనున్నారు.
 
ప్రస్తుతానికి స్థానికులకు మాత్రమే ఈ వెసులుబాటు కల్పించనున్నారు. స్ధానికులతో ట్రయల్ రన్ విజయవంతం అయితే క్రమంగా చిత్తూరు జిల్లా వాసులకు, ఆ తర్వాత రాష్ట్ర ప్రజలకు అమనుమతి ఇవ్వనున్నట్లు సమాచారం. 
 
ఇక భక్తులు ఖచ్చితంగా ఆరు అడుగుల భౌతిక దూరాన్ని పాటించాల్సి ఉంటుంది. భక్తుల దర్శనానికి గాను అనుమతించాలని కోరుతూ టీటీడీ ఎగ్జ్సిక్యూటివ్ అధికారి రాసిన లేఖ నేపథ్యంలో స్పందించిన ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జేఎస్‌వీ ప్రసాద్... అందుకు అనుమతిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.