హరహర మహాదేవ.. : ప్రభుత్వ విప్ చెవిరెడ్డి శైవక్షేత్రాల సందర్శన
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ విప్, తుడ చైర్మెన్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శైవక్షేత్రాలను సందర్శించనున్నారు. గురువారం వేకువజామున 4.30 గంటలకు తుమ్మలగుంట నుంచి బయలుదేరి 6 గంటలకు తలకోన క్షేత్రానికి చేరుకొని పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం చంద్రగిరి నియోజకవర్గంలోని ప్రముఖ శైవక్షేత్రాలను కుటుంబ సమేతంగా దర్శించనున్నారు.
శైవక్షేత్రాల సందర్శన ఇలా..
ముందుగా గురువారం ఉదయం 8 గంటలకు శేష పురం, 9.10 గంటలకు పుట్టాలమ్మ ఆలయం, 9.15 గంటలకు నాగాలమ్మ ఆలయం, 10 గంటలకు ముక్కోటి ఆలయం,10.30 గంటలకు పైడిపల్లి, 11 గంటలకు గొల్లపల్లి, 11.30 గంటలకు చిగురువాడ, మధ్యాహ్నం 12 గంటలకు దుర్గ సముద్రం, 12.30 గంటలకు అడపా రెడ్డి పల్లి,1.15 గంటలకు చల్లావారిపల్లి, 1.45 గంగిరెడ్డి పల్లి, 2.30 రాయల చెరువు, 3.30 గంటలకు తిరుపతి గాంధీరోడ్ లోని వకుళ భవన్ లో బ్రహ్మ సమాజం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉద్భవ లింగం, సాయంత్రం 4.45 గంటలకు యోగిమల్లవరం, 5.55 గంటలకు అవిలాల ఆలయాలను దర్శించనున్నారు.