గురువారం, 5 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 23 సెప్టెంబరు 2024 (14:21 IST)

లడ్డూల్లో జంతుకొవ్వు.. తగ్గేదేలేదంటున్న భక్తులు.. ఊపందుకున్న విక్రయాలు

laddu
తిరుమల పవిత్ర లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీ చేశారన్న వివాదం ప్రపంచవ్యాప్తంగా భక్తులలో విస్తృత ఆందోళనకు దారితీసింది. అయితే, ఈ ఆందోళనకరమైన విషయాలు ఉన్నప్పటికీ, ప్రసిద్ధి చెందిన శ్రీవారి లడ్డూకి డిమాండ్ తగ్గలేదు కదా పెరిగింది. 
 
లడ్డూల తయారులో జంతుకొవ్వుతూ కూడిన నెయ్యి కలిపి ఉండొచ్చని ల్యాబ్ రిపోర్టులు రావడంతో టీటీడీ వేగంగా స్పందించి లడ్డూల తయారీకి నాణ్యమైన స్వచ్ఛమైన నెయ్యినే వినియోగిస్తున్నామని భక్తులకు భరోసా ఇచ్చింది. ఈ భరోసా భక్తుల్లో విశ్వాసాన్ని నింపిందని, దీంతో లడ్డూ విక్రయాలు తగ్గుముఖం పట్టకుండా పెరిగాయని తెలుస్తోంది. 
 
ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 19న 3,59,660 లడ్డూలు పంపిణీ చేశారు. 20వ తేదీన 3,17,954 లడ్డూలను భక్తులకు అందజేశారు. 21న 3,67,607 లడ్డూలు విక్రయించారు. ఈ వివాదాలు భక్తులను ఏమాత్రం లడ్డూ కొనడాన్ని ఆపలేదని టీటీడీ తెలిపింది.  
 
లడ్డూల్లో మెరుగైన రుచి, తాజాదనం, స్వచ్ఛమైన నెయ్యి కారణంగా భక్తులు లడ్డూలను అధికంగా కొనుగోలు చేస్తున్నారు. ప్రారంభంలో భయాందోళనలు ఉన్నప్పటికీ, శ్రీవారి లడ్డూ ప్రసాదం పవిత్రతపై భక్తులకు విశ్వాసం బలంగా ఉంది.