శుక్రవారం, 15 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 10 అక్టోబరు 2024 (10:56 IST)

స్వర్ణరథంపై తిరువీధుల్లో ఊరేగిన మలయప్ప స్వామి

golden ratham
తిరుమలలో జరుగుతున్న ఆరవ రోజు వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మలయప్ప స్వామి తిరుమాడ వీధుల్లో విహరించారు. బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప ఉత్సవమూర్తులు స్వర్ణరథంపై తిరువీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగారు. పట్టువస్త్రాలు, విలువైన ఆభరణాలతో అలంకరించబడిన మలయప్ప స్వామిని తిలకించిన భక్తులు 'గోవిందా... గోవిందా...' అంటూ స్మరించుకున్నారు. 
 
మరోవైపు హ‌నుమంత వాహ‌నంపై కోదండ రామునిగా శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామి శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు బుధ‌వారం ఉదయం 8 గంటలకు శేషాచలాధీశుడు శ్రీ కోదండ రాముని అవతారంలో ధ‌నుస్సు, బాణం ధ‌రించి తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు.