తిరుమలలో రికార్డు స్థాయిలో శ్రీవారి దర్శనం.. 43 రోజుల్లో స్వామి సేవలో 35 లక్షల మంది

సోమవారం, 13 జూన్ 2016 (10:23 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం మరో కొత్త రికార్డును నమోదు చేసింది. అది కూడా అధిక సంఖ్యలో భక్తులకు దర్శనం చేయించి. గతంలో వేసవి కాలంలో ఎప్పుడూ లేనివిధంగా అనూహ్యంగా వచ్చిన భక్తులకు త్వరితగతిన దర్శన భాగ్యం కల్పించింది. మే 1వ తేదీ నుంచి ఆదివారం వరకు 43 రోజుల్లో 35 లక్షల మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 
 
సాధారణంగా భక్తుల రద్దీ పెరిగితే ఆందోళనలు, తితిదే ఉన్నతాధికారులపై శాపనార్థాలు ఉంటాయి. అయితే ఈసారి మాత్రం పెద్దగా ఎక్కడ కూడా ఇలాంటివి కనిపించలేదు. కారణం వచ్చిన భక్తులను కంపార్టుమెంట్ల నుంచి అలాగే క్యూలైన్లలోకి వదలడం. దీని కారణంగా త్వరితగతిన భక్తులు దర్శనం చేసుకోగలిగారు. 
 
తితిదే ఈఓ సాంబశివరావుతో పాటు జెఈఓ శ్రీనివాసరాజుల పర్యవేక్షణే ఇందుకు కారణమని చెప్పుకోవచ్చు. అధిక సంఖ్యలో భక్తులు వచ్చిన సమయంలో వెంటనే వీఐపీ దర్శనాలను రద్దు చేయడమో, తగ్గించడమో చేయడం వల్ల సామాన్యభక్తులు అధికసంఖ్యలో స్వామివారిని దర్శించుకోగలిగారు. 

అన్నీ చూడండి

శుక్రవారం, జూలై 3, 2026 వాతావరణ నివేదిక ఎలా వుందంటే..?

బ్రిటీష్ మహిళ మెదడులో పరాన్నజీవులు - పదేళ్ళపాటు జీవితం నరకప్రాయం

నీట్ యూజీ రీ-ఎగ్జామ్ ప్రొవిజనల్ కీలపై 10 వేల అభ్యంతరాలు.. ఫలితాలు ఎపుడంటే?

డేకేర్‌లో చిన్నారులకు అమానుష శిక్షలు - నోట్లోకి టాయిలెట్ జెట్ స్ప్రేతో నీళ్లు

ఈవ్‌టీజింగ్ చేశాడని చెంపదెబ్బ.. అంతే అక్కాచెల్లెళ్లపై పదునైన ఆయుధాలతో దాడి

అన్నీ చూడండి

03-07-2026 శుక్రవారం ఫలితాలు - మనోభీష్టం సిద్ధిస్తుంది

Sankatahara Chaturthi 2026: జూలై 3న కృష్ణ పింగళ సంకష్టి చతుర్థి.. 21 జిల్లేడు ఆకుల పూజ చేసినా..

02-07-2026 గురువారం ఫలితాలు - మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి

01-07-2026 బుధవారం ఫలితాలు - రుణ సమస్య కొలిక్కి వస్తుంది

01-07-2026 నుంచి 31-07-2026 వరకు మాస ఫలితాలు - ఈ మాసం నిరాశాజనకం

తర్వాతి కథనం
Show comments