1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
  4. No entry to Pilgrims upto May 3rd in Tirumala

శ్రీవారి భక్తులూ చేదువార్త (video)

No entry
తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసిన సంధర్భాలు చాలా అరుదు. గ్రహణ సమయాల్లో మాత్రమే ఆలయాన్ని మూసివేస్తారు. భక్తులను దర్సనానికి అనుమతించరు. ఎలాంటి పరిస్థితిలోనైనా తిరుమల శ్రీవారి ఆలయం మాత్రం తెరిచే ఉంటుంది. ఆపద మ్రొక్కుల వాడు అన్ని సమయాల్లోను భక్తులను కటాక్షిస్తారని పురాణాలు చెబుతుంటారు.
 
అయితే కరోనా మహమ్మారి కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని గత నెల 23వ తేదీ నుంచి భక్తులను దర్సనానికి అనుమతించడం లేదు. అయితే ఆలయంలో మాత్రం కైంకర్యాలు యథావిధిగా నడుస్తూనే ఉన్నాయి. కానీ భక్తులను భగవంతుడికి దూరం చేయడం..భగవంతుడు భక్తులకు దూరమవ్వడం ఇది చరిత్రగా మిగిలిపోక తప్పదు.
 
ప్రస్తుతానికి లాక్ డౌన్ 14వతేదీ వరకు మాత్రమే అని అందరూ అనుకున్నారు. ఎపిలో సిఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం లాక్ డౌన్ కొన్ని మండలాల్లో అవసరం లేదని ప్రధానమంత్రికి చెప్పేశారు.

కానీ ఎపిలో లాక్ డౌన్ ఎత్తివేసినా సరే ఆలయాలను మాత్రం మూసే ఉంచాలన్న నిర్ణయానికి వచ్చారు. తిరుమల ఆలయంలో మాత్రం భక్తులెవరినీ ఈ నెల చివరి వరకు అనుమతించకూడదని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసేసుకుందట. ఇదే విషయంపై టిటిడి అధికారులు కూడా ఒక నిర్ణయం తీసేసుకున్నారట.