కామంతో కాదు.. భక్తిభావంతో చేయండి.. కరోనా నుంచి కాపాడుతా : భవిష్యవాణి

Rangam Bhavishyavani
ఠాగూర్| Last Updated: సోమవారం, 13 జులై 2020 (12:13 IST)
హైదరాబాద్ నగరంలో జరుగుతున్న ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు వేడుకల్లో భాగంగా, సోమవారం రంగం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మహంకాళి అమ్మవారు స్వర్ణలతను ఆవహించి భవిష్యవాణి వినిపించారు. రాబోయే రోజుల్లో మరిన్ని కష్టాలు తప్పవని, ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

ఎవరు చేసుకున్న దానికి వాళ్లు అనుభవించక తప్పదు అని అన్నారు. అయితే కట్టడి చేయడానికి తాను ఉన్నానని.. భక్తి భావనతో ఐదు వారాలు శాక పోసి, యజ్ఞాలు చేయండని ఆజ్ఞాపించారు. ప్రతి గడప నుంచి శాక, పప్పుబెల్లాలు రావాలన్నారు.

కామంతోకాకుండా, భక్తిభావనతో చేసినట్టైతే... తప్పక కాపాడతానన్నారు. ఈ ఏడాది ఉత్సవాలు తనకు సంతోషంగా లేవని అమ్మవారు అన్నారు. ప్రజలందిరినీ తాను కాపాడతానని, కరోనాపై పోరాడతానని తెలిపారు. రాబోయే రోజులు కష్టాలతో ఉంటాయని.. తీవ్రస్వరంలో చెప్పారు.దీనిపై మరింత చదవండి :