గురువారం, 21 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 ఆగస్టు 2025 (11:09 IST)

అమెరికా అదనపు సుంకాలు.. భారత్‌కు రిలీఫ్.. డొనాల్డ్ ట్రంప్ ఏమన్నారంటే?

Donald Trump
Donald Trump
అమెరికా విధించిన అదనపు సుంకాల గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోరు విప్పారు. దీనిపై కీలక ప్రకటన చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై ఇప్పుడు కొత్త సుంకాలు విధించడాన్ని తాను పరిగణించాల్సిన అవసరం లేదని ట్రంప్ అన్నారు. 
 
మరో రెండు లేదా మూడు వారాల్లో ఈ అంశాన్ని పునఃపరిశీలిస్తామని చెప్పుకొచ్చారు. కానీ ప్రస్తుతం మనం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని అన్నారు. 
 
భారత్ పై తాను విధించిన అదనపు సుంకాల వల్లనే రష్యాతో సమావేశం జరిగేలా ప్రేరేపించిందని చెప్పారు. తాను సుంకాలను విధించినందు వల్ల భారత్...రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపేయాల్సి వచ్చిందని..అది ఆ దేశంపై వత్తిడి తీసుకువచ్చిందని ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. 
 
భారత్ అతి పెద్ద వినియోగదారుడని...చైనాకు చాలా దగ్గరలో ఉందని అన్నారు. అయితే ఇప్పుడు ట్రంప్ చెప్పిన దానిబట్టి భారత్ పై అదనపు సుంకాలు అమలు అవుతాయా లేదా అని తెలియాలంటే ఆగస్టు 27 వరకు వెయిట్ చేయాల్సిందే.