మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 29 జూన్ 2018 (16:26 IST)

కాలజ్ఞానంలో శివుని కంట నీరు- సిద్ధిపేట ఎల్లమ్మ ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంది..?

వీరబ్రహ్మంగారి కాలజ్ఞానంలో మల్లికార్జునుడు సాక్షాత్కరంగా ప్రజలతో మాట్లాడుతాడని, శివుని కంట నీరు కారుతుందని, బసవేశ్వరుడు రంకె వేసి కాలుదువ్వుతాడని పేర్కొన్నారు. వీరబ్రహ్మంగారు కాలజ్ఞానంలో పేర్కొన్న విషయాలు జరుగుతూ వస్తున్నాయి. తాజాగా ఈశ్వరునికి కళ్లల్

వీరబ్రహ్మంగారి కాలజ్ఞానంలో మల్లికార్జునుడు సాక్షాత్కరంగా ప్రజలతో మాట్లాడుతాడని, శివుని కంట నీరు కారుతుందని, బసవేశ్వరుడు రంకె వేసి కాలుదువ్వుతాడని పేర్కొన్నారు. వీరబ్రహ్మంగారు కాలజ్ఞానంలో పేర్కొన్న విషయాలు జరుగుతూ వస్తున్నాయి. తాజాగా ఈశ్వరునికి కళ్లల్లో కాకుండా సిద్ధిపేట ఎల్లమ్మ కన్నీరు కారుస్తున్నదట. ఈ విషయం తెలుసుకున్న భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. 
 
సిద్ధిపేట జిల్లా పరిధిలోని చిన్నకోడూర్ మండలం చంద్లాపూర్‌లోని రేణుక ఎల్లమ్మ ఆలయంలోని విగ్రహం నుంచి గత రెండు రోజులు నుంచి కన్నీళ్లు వస్తున్నాయని ప్రచారం సాగుతోంది. రంగనాయక సాగర్ ప్రాజెక్టులో భాగంగా, చంద్లాపూర్ గ్రామం ముంపు గ్రామమైంది. 
 
దీంతో ఎల్లమ్మ తల్లికి బాధ కలిగిందని.. అందుకే ఆ తల్లి ఏడుస్తోందని ప్రచారం సాగుతోంది. ఇక ఈ వింతను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది తరలివచ్చి, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఏవైనా అశుభాలు జరుగుతాయోనని భక్తులు జడుసుకుంటూ దీపారాధనలు చేస్తున్నారు.