1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
  4. Thiruchanur Online Virtual kalyanotsavam soon

తిరుచానూరులో త్వ‌ర‌లో ఆన్‌లైన్‌ వ‌ర్చువ‌ల్ క‌ల్యాణోత్స‌వం ప్రారంభం

Thiruchanur
కరోనా కారణంగా తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో కూడా పలు సేవలు నిలిచిపోయాయి. కానీ ప్రస్తుతం యథావిధిగా భక్తుల సంఖ్య క్రమేపీ పెరుగుతుండటంతో ఆన్‌లైన్ సేవలను ప్రారంభించాలని టిటిడి నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఇప్పటికే తిరుమలలో ఆన్లైన్ వర్చువల్ కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తున్న టిటిడి తిరుచానూరులో కూడా చేయాలన్న నిర్ణయానికి వచ్చింది. 
 
ఈ నేపథ్యంలో  తిరుమల శ్రీవారి ఆల‌యం త‌ర‌హాలో తిరుచానూరులోని శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో త్వ‌ర‌లో ఆన్‌లైన్ వ‌ర్చువ‌ల్ క‌ల్యాణోత్స‌వం ప్రారంభించేందుకు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. సోమ‌వారం నుండి శుక్ర‌వారం వ‌ర‌కు వ‌ర్చువ‌ల్ క‌ల్యాణోత్స‌వం టికెట్ల‌ను ఆన్‌లైన్‌లో విడుద‌ల చేస్తారు. ఈ టికెట్ ధ‌ర‌ను రూ.500/-గా నిర్ణ‌యించారు. 
 
గృహ‌స్తులు ఆన్‌లైన్‌లో ఈ టికెట్ల‌ను బుక్ చేసుకుని ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా క‌ల్యాణోత్స‌వాన్ని వీక్షించ‌వ‌చ్చు. ఆ త‌రువాత 90 రోజుల్లోపు గృహ‌స్తులు తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారిని రూ.100/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం క్యూలైన్‌లో ఉచితంగా ద‌ర్శించుకోవ‌చ్చు. ద‌ర్శ‌నానంత‌రం ఒక ఉత్త‌రీయం, ఒక ర‌వికె, అక్షింత‌లు ప్ర‌సాదంగా అందిస్తారు.
About Writer
జె
తర్వాతి కథనం
ఈ ఇంద్రియాలను వాటికోసమే వాడుకోవాలి..