గురువారం, 5 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ttdj
Last Updated : శనివారం, 7 మే 2016 (12:17 IST)

తిరుమలలో సాధారణ స్థాయిలో భక్తులు... శ్రీవారి సేవలో 'సుప్రీమ్' టీం సభ్యులు

వారాంతం కావస్తున్నా తిరుమలలో రద్దీ మాత్రం సాధారణంగానే ఉంది. సాధారణంగా ప్రతి శనివారం తిరుమలలో అధిక సంఖ్యలో భక్తుల రద్దీ ఉంటుంది. కానీ, ఈ శనివారం మాత్రం రద్దీ తక్కువగా ఉంది. శనివారం ఉదయం 5 గంటల నుంచి సర్వదర్శనం కోసం 7 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా వారికి నాలుగు గంటలు దర్శన సమయం పడుతోంది. అలాగే కాలినడక భక్తులు 6 కంపార్టమెంట్లో వేచి ఉండగా వారికి దర్శనం 3 గంటల సమయం పడుతోంది. శుక్రవారం శ్రీవారిని 70,969 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.2.17 లక్షలుగా వసూలైంది.
 
అలాగే, తిరుమల శ్రీవారిని "సుప్రీమ్" సినీ యూనిట్‌ దర్శించుకుంది. వీఐపీ విరామ దర్శన సమయంలో సినీ హీరో సాయి ధరమ్ తేజ్‌‌తో పాటు హీరోయిన్‌ రాశీఖన్నా, దర్శకుడు అనిల్‌ రావిపూడి, నిర్మాత దిల్‌ రాజు చిత్ర యూనిట్‌ సభ్యులు దర్శించుకున్నారు. ఆలయంలోని రంగనాయకమండపంలో సినీ యూనిట్‌ సభ్యులకు తితిదే అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయంలో సినీ ప్రముఖలను చూసేందుకు అభిమానులు పోటీపడ్డారు.