శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By tj
Last Updated : బుధవారం, 31 మే 2017 (14:30 IST)

తిరుపతి గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

తిరుపతి గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా ప్రారంభమయ్యాయి. ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలను తితిదే ప్రారంభించింది. వేదపండితుల వేదమంత్రోచ్ఛారణల మధ్య గరుడపటాన్ని ధ్వజస్థంభంపై ఎగురవేసి సర్వదేవతలను

తిరుపతి గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా ప్రారంభమయ్యాయి. ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలను తితిదే ప్రారంభించింది. వేదపండితుల వేదమంత్రోచ్ఛారణల మధ్య గరుడపటాన్ని ధ్వజస్థంభంపై ఎగురవేసి సర్వదేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. 
 
కర్కాటక లగ్నంలో ధ్వజారోహణ ఘట్టాన్ని నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాలు జూన్ 8వ తేదీ వరకు జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాల సమయంలో రోజుకో వాహనంపై స్వామి, అమ్మవార్లు ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. అధికసంఖ్యలో భక్తులు స్వామివారి ధ్వజారోహణ కార్యక్రమాన్ని తిలకించారు. గోవిందనామస్మరణలతో గోవిందరాజ ఆలయం మార్మోగింది.