బుధవారం, 4 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ttdj
Last Updated : శనివారం, 7 మే 2016 (16:55 IST)

ధర్మప్రచారానికి వారధిగా శుభప్రదం బోధకులు నిలవాలి : తితిదే ఈఓ సాంబశివరావు

సనాతన ధర్మప్రచారానికి వారధులుగా శుభప్రదం బోధకులు నిలవాలని తితిదే ఈఓ సాంబశివరావు పిలుపునిచ్చారు. తిరుపతిలోని శ్వేత భవనంలో శనివారం శుభప్రదం బోధకులకు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ శుభప్రదంలో శిక్షణ పొందిన బోధకులు తమ జిల్లాలోని శుభప్రదంలో పాల్గొనే ఇతర అధ్యాపకులకు శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. బోధకులు పాఠ్యాంశాలను సరళమైన పద్ధతిలో బోధించి ఎక్కువమంది విద్యార్థులు స్ఫూర్తి పొంది, మార్గదర్శకంగా నిలిచేలా తీర్చిదిద్దాలని సూచించారు.
 
అధ్యాపకులు, పాఠ్యాంశాలు సరళమైన పద్ధతులతో బోధించాలని అందుకు అనుగుణంగా పాఠ్యాంశాల్లో మార్పులు చేసినట్లు తెలిపారు. శుభప్రదంలోని బోధన అంశాలను శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌ ద్వారా ప్రసారం చేయడం ద్వారా లక్షలాది మంది ప్రజలు తెలుసుకుంటారని ఈఓ తెలిపారు. శుభప్రదం కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని మొత్తం 60 కేంద్రాల్లో 23 వేల మంది 8,9,10 తరగతుల విద్యార్థినీ, విద్యార్థులు మే 22 నుంచి 29వ తేదీ వరకు శిక్షణా తరగతులు నిర్వహిస్తామన్నారు.