శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 14 జులై 2019 (13:24 IST)

ఇంద్రకీలాద్రిపై శాకాంబరి ఉత్సవాలు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై శాకాంబరి ఉత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలను దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమ్మవారి కరుణాకటాక్షాలు రాష్ట్రంపై ఎప్పుడూ ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్టు చెప్పారు. 
 
ప్రతి ఏటా ఆషాఢమాసంలో ఇంద్రకీలాద్రిపై మూడు రోజులపాటు శాకాంబరీ ఉత్సవాలు జరపడం ఆనవాయితీ. ఆదివారం ఇంద్రకీలాద్రిపై శాకాంబరీ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారిని శాకాంబరీ దేవి రూపంలో అలంకరించారు. ఆలయాన్ని వివిధ రకాల పళ్లు, కూరగాయలు, ఆకుకూరలతో అలంకరించారు. 
 
ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉద‌యం దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కుటుంబ స‌భ్య‌ల‌తో క‌లిసి అమ్మవారిని దర్శించుకున్నారు. అధికారులు ఆలయ మర్యాదలతో మంత్రికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.