శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 20 డిశెంబరు 2016 (11:10 IST)

శ్రీవారి పుష్కరిణిలో అపశృతి.. మహిళ మృతి.. హుండీ ఆదాయం రూ.2.67కోట్లు

తిరుమల శ్రీవారి పుష్కరిణిలో అపశృతి చోటుచేసుకుంది. పుష్కరిణిలో పడి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. దాంతో పుష్కరిణిని తాత్కాలికంగా మూసివేశామని, సంప్రోక్షణ అనంతరం భక్తులను పుష్కర స్నానానికి అనుమతించనున్నట్ల

తిరుమల శ్రీవారి పుష్కరిణిలో అపశృతి చోటుచేసుకుంది. పుష్కరిణిలో పడి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. దాంతో పుష్కరిణిని తాత్కాలికంగా మూసివేశామని, సంప్రోక్షణ అనంతరం భక్తులను పుష్కర స్నానానికి అనుమతించనున్నట్లు టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు పేర్కొన్నారు. కాగా, మృతురాలు తిరుపతికి చెందిన నాగరత్నంగా పోలీసులు గుర్తించారు.
 
ఇదిలా ఉంటే.. నోట్ల రద్దుతో కిటకిటలాడేంత రద్దీ లేనప్పటికీ, తిరుమల శ్రీవారి ఆదాయం రికార్డు స్థాయికి నమోదవుతోంది. ఆదివారం నాడు హుండీ ఆదాయం రూ. 2.67 కోట్లు వచ్చినట్టు టీటీడీ అధికారులు తెలిపారు. మొత్తం 78,752 మంది భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకున్నారని, 30,424 మంది తలనీలాలు సమర్పించారని చెప్పుకొచ్చారు.