ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. చెవాకులు
Written By
Last Modified: శుక్రవారం, 13 సెప్టెంబరు 2019 (12:40 IST)

మళ్లీ ఇలాంటి వెధవ వేషాలు వేసావంటే నీ వీపు చీరేస్తా...

"ఏమిటే నీకసలు బుద్దుందా...నాకు కళ్లు సరిగా కనిపించవని మీ అమ్మతో చెపుతావా... మళ్లీ ఇలాంటి వెధవ వేషాలు వేసావంటే నీ వీపు చీరేస్తా" అరిచాడు భర్త అప్పారావు. 
"నేను మీ అత్తగార్ని బాబూ... అమ్మాయి పెరట్లో బట్టలు ఉతుకుతోంది వెళ్లి చూడు..." భయపడుతూ చెప్పింది అత్త గారు సుబ్బలక్ష్మి. 
 
 
గీత : ప్రియా నన్ను మోసం చేయవు కదా ?
శ్రీను : న్నినెందుకు మోసం చేస్తాను రాధ, సీత, లీలను చేస్తాను గాని.
 
 
రాధ : "నేను శ్రీహరితో నా ఎంగేజ్‌మెంట్‌ తెంపేసుకున్నాను. అతని పట్ల నా ఫీలింగ్స్ మారిపోయాయి."
జ్యోతి : "మరి ఇంకా ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ నీ చేతికి వుందే?".
రాధ : " ఈ ఉంగరం పట్ల నా ఫీలింగ్స్ మారలేదు". (ఉంగరం వంక ఓ సారి చూసుకుని)