బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. చెవాకులు
Written By Mohan
Last Modified: శుక్రవారం, 28 ఏప్రియల్ 2017 (12:59 IST)

ఇందుమూలముగా తెలియజేయునది ఏమనగా... భారతదేశంలో మాత్రమే ఇలా జరుగును...

ప్రపంచంలో భారతదేశానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. కానీ కొన్ని సంఘటనలు భారతదేశంలో మాత్రమే జరుగుతాయి. వాటిలో మచ్చుకు కొన్ని ఇలా ఉంటాయి. 1) కూతురు చదువు ఖర్చు కంటే పెళ్ళికి ఎక్కువ ఖర్చు చేస్తారు. 2) ఆఫీస్‌కి అందరూ హడావుడి కానీ ఎవరూ టైంకి ఆఫీస్‌కి రారు. 3

ప్రపంచంలో భారతదేశానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. కానీ కొన్ని సంఘటనలు భారతదేశంలో మాత్రమే జరుగుతాయి. వాటిలో మచ్చుకు కొన్ని ఇలా ఉంటాయి. 
1) కూతురు చదువు ఖర్చు కంటే పెళ్ళికి ఎక్కువ ఖర్చు చేస్తారు.
2) ఆఫీస్‌కి అందరూ హడావుడి కానీ ఎవరూ టైంకి ఆఫీస్‌కి రారు.
3) పోలీసుని చూస్తే భద్రత కంటే భయం ఎక్కువ.
4) అస్సలు పరిచయం లేని వ్యక్తితో ఆడపిల్ల మాట్లాడకూడదు కానీ పెళ్ళి చేసుకోవచ్చు.
5) ప్రజలకు సిగ్గు చాలా ఎక్కువ అయినా జనాభా 130 కోట్ల పైమాటే.
6) కాళ్ళకి వేసుకునే చెప్పులు ఏసీలో అమ్ముతారు, అన్నంలో తినే కూరగాయలు మురుగు కాలువ ప్రక్కనే అమ్ముతారు.
7)  ఫోన్లు పగలకుండా స్క్రీన్ గార్డ్ వాడతారు, తలని కాపాడే హెల్మెట్ మాత్రం పెట్టుకోరు.
8) మ్యాజిక్‌లు చేసే స్వామిజీలను నమ్ముతారు కానీ లాజిక్‌ని చెప్పే సైంటిస్ట్‌‌ని నమ్మరు.
9) కష్టపడి పండించే బియ్యాన్ని ఉచితంగా ఇస్తారు, సాధారణంగా లభించే మట్టిని, ఇసుకను అమ్ముతారు.
10) బ్యాంకులకు వేలకోట్లు అప్పు ఎగ్గొట్టి విదేశాలలో స్కాచ్ తాగేవారు ఉన్నారు, వేలల్లో అప్పు తీసుకున్నవారు మాత్రం అప్పు తీర్చలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకునేవారూ ఉన్నారు.