ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 20 జూన్ 2023 (16:34 IST)

ప్రభాస్ నటించిన సాలార్ కౌంట్ డౌన్ మొదలైంది

salar poster
salar poster
ప్రభాస్, శృతి హాసన్ నటించిన సలార్ చిత్రం కౌంట్ డౌన్ మొదలైంది. ఈరోజునుంచి వంద రోజులలో విడుదల కాబోతుంది అని చిత్ర యూనిట్ పోస్టర్తో అభిమానులకు తెలియజేసింది. ఇప్పటికే ప్రభాస్ సినిమా ఆదిపురుష్ వివాదాల్లో ఉంది. సినిమాను సరిగా ఓం రౌత్ తీయలేదని అందరూ ఘోషిస్తున్నారు. ఈ సినిమాకు ప్రముఖ రాజకీయ పార్థి అనుబంధ సంస్థ అండగాఉందనే టాక్ జరుగుతోంది. 
 
కాగా,  సాలార్ తో నైనా ప్రభాస్ అలరిస్తాడా అనేది ప్రజల్లో నెలకొంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం షూటింగ్ ఒకేసారి తెలుగు, కన్నడ భాషలలో జరుగుతుంది. హాంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ కిరాగందుర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇందులో 
పృథ్వీరాజ్ సుకుమారన్, మీనాక్షి చౌదరి, శరణ్ శక్తి, జగపతి బాబు, ఈశ్వరి రావు తదితరులు నటించారు. రవి బసురోర్ సంగీతం అందించారు. సెప్టెంబర్ 28న సాలార్ విడుదలకానుంది.