శుక్రవారం, 10 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Ganesh
Last Updated : బుధవారం, 2 జులై 2014 (11:51 IST)

జంతువులను హింసించరాదంటూ అశ్విని పొన్నప్ప వినూత్న సందేశం!

జంతువుల రక్షణ కోసం ప్రముఖ భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అశ్విని పొన్నప్ప నడుంబిగించారు. ఎనుగులు, పులులు, చిరుతలు, సింహాలు, కోతులు వంటి జంతువుల కాళ్లకు సంకెళ్లు వేయడం బాధాకరమని ఆమె ఆవేధన వ్యక్తంచేశారు. అడవి జంతువులను సర్కస్‌లో ఆడించడం అమానుషమనే సందేశ కార్యక్రమాన్ని ఆమె పెటా సంస్థ తరఫున మంగళవారం బెంగళూరులో నిర్వహించారు. ఈ సందర్భంగా అశ్విని పొన్నప్ప సంకెళ్లతో బంధించుకొని జంతువులను హింసించరాదంటూ సందేశాన్నిచ్చింది.