ఆసియన్ బ్యాడ్మింటన్ టోర్నీ : సెమీస్‌లో సైనా నెహ్వాల్ ఓటమి
వుహాన్ వేదికగా జరుగుతున్న ఆసియన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఓటమి పాలైంది. శనివారం జరిగిన కీలక మ్యాచ్‌లో తన ప్రత్యర్థి చైనాకు చెందిన వాంగ్ యిహాన్ చేతిలో 16-21, 14-21 స్కోరు తేడాతో పరాజయం పాలైంది. నిజానికీ మ్యాచ్‌లో ఈ ఇద్దరు క్రీడాకారిణిలు నువ్వానేనా అన్నరీతిలో సాగింది. అయితే, కీలక సమయాల్లో సైనా తన ఆధిక్యాన్ని నిలబెట్టుకోలేకపోయిన సైనా నెహ్వాల్ ఓడిపోయింది.
అంతకముందు టోర్నీలో సైనా నిలకడైన ఆటతీరుతో అదరగొట్టింది. ఒలింపిక్ కాంస్య పతక విజేత సైనా క్వార్టర్‌ఫైనల్లో 21-16, 21-19తో చైనాకు చెందిన స్టార్ షట్లర్ షిజియాన్ వాంగ్‌ను చిత్తుచేసింది. అయితే, సెమీ ఫైనల్ మ్యాచ్‍లో మాత్రం చైనాకే చెందిన క్రీడాకారిణి చేతిలో ఓడిపోయింది.