సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 27 ఆగస్టు 2021 (20:06 IST)

టోక్యో పారాలింపిక్స్‌‌లో భవీనాబెన్‌ పటేల్‌ అదుర్స్.. పతకం ఖాయం

bhavina patel
టోక్యో పారాలింపిక్స్‌‌లో భారత్‌కు పతకం ఖాయమైంది. టేబుల్‌ టెన్నిస్‌ మహిళల సింగిల్స్‌ క్లాస్‌-4 విభాగంలో సెమీ ఫైనల్‌లో అడుగు పెట్టి భారత్‌కు పతకం ఖాయం చేసింది. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్‌గా రికార్డులకెక్కింది. 
 
టోక్యో పారాలింపిక్స్‌లో తొలి రోజు నిరాశపరిచిన భారత టేబుల్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ భవీనాబెన్‌ పటేల్‌ రెండో రోజు ఆశాజనక ఫలితం సాధించింది. 
 
గ్రూపు-ఏ మహిళల క్లాస్‌ 4 విభాగంలో బరిలోకి దిగిన ప్యాడ్లర్‌ భవీనా.. గురువారం జరిగిన హోరాహోరి మ్యాచ్‌‌లో మేగన్‌ షక్లెటన్‌ (గ్రేట్‌ బ్రిటన్‌)పై 3-1 (11-7, 9-11, 17-15, 13-11)తో విజయం సాధించింది. 
 
డూ ఆర్‌ డై మ్యాచ్‌ అయిన పోటీలో ఆత్మవిశ్వాసంతో ఆడిన భవీనా.. ప్రపంచ ర్యాంకింగుల్లో తనకంటే మూడు ర్యాంక్‌లు ముందున్న మేగన్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. 
 
మరోవైపు మహిళల సింగిల్స్‌ క్లాస్‌-3లో సోనాల్‌బెన్‌ 1-3తో లీ మి గ్యూ(దక్షిణకొరియా) చేతిలో ఓడి నిష్క్రమించింది. దీంతో మెగాటోర్నీలో ఆమె పోరాటం ముగిసింది.