ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీఫైనల్లోకి అమెరికా నల్లకలువ

Serena williams
సెల్వి| Last Updated: మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (17:25 IST)
Serena williams
అమెరికా నల్లకలువ సెరీనా విలియమ్స్ ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. క్వార్టర్స్‌లో వరల్డ్ నెంబర్ 2 ప్లేయర్ సైమోనా హలెప్‌ను ఓడించింది. అయితే సెమీస్‌లో జపాన్ స్టార్ నవోమి ఒసాకాతో సెరీనా పోటీపడనుంది. 23 గ్రాండ్ స్లామ్ టైటిళ్లతో జోరుమీదున్న సెరీనా.. రొమేనియా ప్లేయర్ హలెప్‌పై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. 6-3, 6-3 తేడాతో ఈజీగా విక్టరీ సాధించింది.

గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో సెమీస్‌లో ఆడడం ఇది సెరీనాకు 40వ సారి కానుంది. 24 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలిచిన మార్గరేట్ కోర్ట్ రికార్డును బ్రేక్ చేయాలని సెరీనా ఎదురుచూస్తుంది. సెరీనా, ఒసాకాలు చివరిసారి 2018 యూఎస్ ఓపెన్ ఫైనల్లోతలపడ్డారు. ఆ మ్యాచ్‌లో అంపైర్‌తో గొడవపెట్టుకున్న సెరీనా.. మ్యాచ్ కోల్పోయిన విషయం తెలిసిందే. 2017లో చివరి గ్రాండ్‌స్లామ్ విక్టరీ అందుకున్న సెరీనా.. ఈసారి మాత్రం ట్రోఫీని చేజిక్కించుకోవాలని పట్టుదలతో ఉంది.దీనిపై మరింత చదవండి :