సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 24 ఫిబ్రవరి 2020 (15:18 IST)

దుబాయ్ టెన్నిస్‌లో నోవాక్ జకోవిచ్.. పగలంతా ఫ్యామిలీతో రాత్రంతా టెన్నిస్‌తో..!

టాప్ సీడెడ్, ప్రపంచ నెంబర్ ఆటగాడు, నోవాక్ జకోవిచ్ దుబాయ్ డ్యూటీ ఫ్రీ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు సన్నద్ధమవుతున్నాడు. ఇటీవల జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ ట్రోఫీని ఎనిమిదోసారి గెలుచుకున్న తర్వాత దుబాయ్ టోర్నీలో నోవాక్ పాల్గొననుండటం విశేషం.

17సార్లు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గిన నోవాక్ జకోవిచ్ ఐదోసారి దుబాయ్ టైటిల్ నెగ్గేందుకు రెడీ అవుతున్నాడు. కాగా 2009-11, 2013 సంవత్సరాల్లో దుబాయ్ టోర్నీలను గెలుచుకున్నాడు. కానీ కంటిలో ఇన్ఫెక్షన్ కారణంగా 2016లో మాత్రం ఈ టోర్నీకి జకోవిచ్ దూరమయ్యాడు. 
 
ఈ సందర్భంగా నోవాక్ జకోవిచ్ మాట్లాడుతూ.. ఈ టోర్నీలో ఆడటం గొప్ప అనుభూతినిస్తుందని చెప్పాడు. తన కుటుంబంతో పాటు దుబాయ్ వచ్చానని.. బీచ్‌లో చాలా సమయం గడపటం, పగటిపూట కుటుంబంతో వుంటూ రాత్రిపూట ఆడుకుంటూ గడిపేస్తానని తెలిపాడు. తాను మూడేళ్ళుగా దుబాయ్‌లో ఆడలేదు, కాబట్టి గట్టిపోటీతో ఆడాలని చూస్తున్నట్లు చెప్పాడు. 
 
దుబాయ్‌లో మస్తుగా ఎంజాయ్ చేస్తున్నానని.. తాను ఆస్ట్రేలియాకు వెళ్లేముందు కనీసం ఏడు నుంచి పదిరోజుల ముందు శిక్షణ కోసం ప్రీ-సీజన్‌లో దుబాయ్‌కి వస్తున్నాను. ఇక్కడ చాలా పెద్ద సెర్బియన్ అసోసిసేయన్ వుంది. కాబట్టి వారి మద్దతు తనకు పూర్తిగా లభిస్తుందని చెప్పుకొచ్చాడు. 
 
ఈ సీజన్‌ను శుభారంభం చేశానని, ఆస్ట్రేలియా ఓపెన్‌తో పాటు 13 సింగిల్స్ టైటిల్స్, రెండు డబుల్స్‌లోను రాణించానని.. తనలో ఆత్మవిశ్వాసం మెరుగైందని.. తప్పకుండా ఇకపై ఆడే టోర్నీల్లో సత్తా చాటుతానని నోవాక్ జకోవిచ్ వ్యాఖ్యానించాడు. ఇంకా ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలుచుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపాడు. 
ఇకపోతే.. దుబాయ్ డ్యూటీ ఫ్రీ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లు దుబాయ్ డ్యూటీ ఫ్రీ యాజమాన్యం నిర్వహిస్తాయి. యుఎఇ ఉపాధ్యక్షుడు, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హెచ్. హెచ్. షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతాయి. 
 
ఈ టోర్నమెంట్ ఫిబ్రవరి 29 వరకు కొనసాగుతుంది. ఇందులో నోవాక్ జొకోవిక్ ఎటిపి ఫైనల్స్ విజేత స్టెఫానోస్ సిట్సిపాస్, 2020 రోటర్డ్యామ్, మాంట్పెల్లియర్ ఛాంపియన్ గేల్ మోన్ఫిల్స్, 2018 దుబాయ్ విజేత రాబర్టో బటిస్టా అగుట్  పాల్గొంటారు. ఇదే టోర్నీలో నోవాక్ డబుల్స్ బరిలోకి దిగనున్నాడు. మొదటిసారి మారిన్ సిలిక్‌తో భాగస్వామ్యం నెలకొల్పుతాడు.