శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 3 ఫిబ్రవరి 2020 (18:12 IST)

అంపైర్ బూటు తాకిన జకోవిచ్.. కారణం ఏంటో తెలుసా?

Novak Djokovic
ఆస్ట్రేలియన్ ఓపెన్ సింగిల్స్ విజేతగా డిఫెండింగ్ ఛాంపియన్ నోవాక్ జకోవిచ్ నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జకోవిచ్ ఓ వివాదంలో చిక్కుకుని జరిమానా ఎదుర్కొన్నాడు. పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌ సందర్భంగా ఛైర్‌ అంపైర్‌ పాదాన్ని తాకడంపై నోవాక్‌ జకోవిచ్‌ స్పందించాడు. అంపైర్‌ పాదాన్ని తాకినందుకు తానెంతో చింతిస్తున్నట్లు చెప్పాడు. 
 
అంపైర్‌ షూను టచ్‌ చేసే సమయంలో తాను ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని వివరణ ఇచ్చుకున్నాడు. నిజంగా స్నేహపూర్వకంగానే తాకానని తెలిపాడు. వరుసగా రెండు సార్లు జొకోవిచ్‌ నిర్ణీత సమయంలో సర్వీస్‌ చేయకపోవడంతో అంపైర్‌  డామియన్ డుముసోయిస్(ఫ్రెంచ్‌) సెర్బియా స్టార్‌ జొకోను హెచ్చరించాడు. రెండో సెట్‌లో 4-4తో సమంగా ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. 
 
కానీ జకోవిచ్ సహనం కోల్పోయి.. ఈ మ్యాచ్‌లో ఫేమస్ అయ్యేలా చూసుకున్నావని.. గ్రేట్ జాబ్, వెల్డన్ అంటూ సెటైర్లు విసిరాడు. దీనిపై అంపైర్ స్పందించకపోయినా.. జకోవిచ్ మాత్రం స్పందించాడు. 
 
కేవలం స్నేహపూర్వకంగా ఇదంతా చేశానని వివరణ ఇచ్చుకున్నాడు. అయితే అఫిషియల్‌ గ్రాండ్‌ రూల్‌ బుక్‌ నియమావళి ప్రకారం నొవాక్‌కు భారీ జరిమానా విధించనున్నారు. నిబంధనల ప్రకారం అతనికి సుమారు 14లక్షల వరకు జరిమానా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.