1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Updated : ఆదివారం, 23 జూన్ 2019 (13:59 IST)

సారీ సార్... క్షమించండి... అంపైర్‌కు రెండు చేతులెత్తి నమస్కరించన కోహ్లీ

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డ్ అంపైర్‌కు రెండు చేతులెత్తి నమస్కరించాడు. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి ఇపుడు షోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వరల్డ్ క్రికెట్ పోటీల్లో భాగంగా శనివారం భారత్ - ఆప్ఘాన్ జట్ల మధ్య లీగ్ మ్యాచ్ జరిగింది. ఇందులో భారత్ అష్టకష్టాలు పడి 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. 
 
అయితే, ఈ మ్యాచ్ సందర్భంగా ఫీల్డ్ అంపైర్‌కు కోహ్లీ రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టిన ఫోటో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అసలు అంపైర్‌కు కోహ్లీ ఎందుకు నమస్కారం పెట్టాడో ఇపుడు తెలుసుకుందాం. 
 
భారత్‌, ఆప్ఘాన్ మధ్య మ్యాచ్ జరుగగా, ఛేదనలో భాగంగా హజ్రతుల్లా బ్యాటింగ్‌ చేస్తున్న వేళ, షమీ బౌలింగ్ చేస్తున్నాడు. అపుడు షమి వేసిన బంతి హజ్రతుల్లా బ్యాక్‌ ప్యాడ్‌‌కి తగిలినట్టుగా గమనించిన ఆటగాళ్లు, అప్పీల్‌ చేయగా, అంపైర్‌ 'నాటౌట్' అని తేల్చాడు. 
 
దీనిపై కోహ్లీ డీఆర్‌ఎస్‌‌కు వెళ్లి విఫలమయ్యాడు. ఆ సమయంలో అంపైర్ వద్దకు వెళ్లిన కోహ్లీ, రెండు చేతులు జోడించి ఏదో మాట్లాడాడు. బహుశా తామంతా ఎల్బీ అనుకున్న బంతిని అంత కరెక్టుగా నౌటౌట్ కాదని అంపైర్ గమనించడంతో ఆశ్చర్యానికి గురైన కోహ్లీ, ఆ విధంగా ఓ నమస్కారం చేసి, అతని సునిశిత దృష్టిని అభినందించివుంటాడని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ దృశ్యం, వైరల్‌ కాగా, ఎవరికి తోచిన మీమ్స్‌‌ను వారు పోరస్ట్ చేస్తున్నారు. అదన్నమాట సంగతి.