శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By
Last Updated : శనివారం, 13 జులై 2019 (15:33 IST)

వింబుల్డన్‌ ఫైనల్‌లో ఆసక్తికర పోరు.. నాదల్ వర్సెస్ జకోవిచ్

వింబుల్డన్ ఫైనల్‌లో ఆసక్తికర పోరు జరుగనుంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ నోవాక్‌ జకోవిచ్‌, స్విస్ దిగ్గజం రోజర్ ఫెడరర్‌ వింబుల్డన్‌-2019 ఫైనల్‌కు చేరుకున్నారు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి సెమీఫైనల్లో జకోవిచ్‌ 6-2, 4-6, 6-3, 6-2తో 23వ సీడ్‌ బాటిస్టా అగుట్‌ (స్పెయిన్‌)పై గెలుపును నమోదు చేసుకున్నాడు.
 
అలాగే ఫెదరర్‌ 7-6 (7/3), 1-6, 6-3, 6-4తో మూడో సీడ్‌ రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌)పై గెలిచాడు. ఇక టాప్ స్టార్స్ ఫెదరర్ నోవాక్ జకోవిచ్‌ల మధ్య ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరుగనుంది. ఇక వింబుల్డన్‌ మహిళల సింగిల్స్‌ టైటిల్‌ కోసం సెరెనా విలియమ్స్‌, సిమోనా హలెప్‌ శనివారం తలపడనున్నారు.