శనివారం, 28 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Updated : శనివారం, 13 జులై 2019 (11:17 IST)

ఐసీసీ ఓవరాక్షన్.. ధోనీ రనౌట్‌.. హస్త ల విస్త బేబీ.. సర్జికల్ స్ట్రైక్స్ అంటూ?

ప్రపంచ కప్ సెమీఫైనల్లో టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ రనౌట్ వీడియోను ఐసీసీ తన అధికారిక ట్విటర్‌ వేదికగా పంచుకుంది. హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్‌ నటించిన 'టెర్మినేటర్' సినిమాలోని 'హస్త ల విస్త బేబీ' అనే డైలాగ్‌తో ఐసీసీ తన ఖాతాలో ఉంచింది.


'హస్త ల విస్త బేబీ' అంటే 'మళ్లీ కలుద్దాం' అని అర్థం. ధోనీ రనౌట్ వీడియోతో పాటు 'హస్త ల విస్త ధోనీ' అంటూ ఐసీసీ ట్వీట్‌ చేయడంపై భారత అభిమానుల తీవ్రంగా మండిపడుతున్నారు.
 
అలాగే మార్టిన్ గుప్టిల్ భారతదేశంపై సర్జికల్ స్ట్రైక్ చేసాడని ఐసీసీ ద్రువీకరిస్తోంది. హెలికాప్టర్ షాట్ కుప్పకూలింది, స్వచ్ఛమైన సర్జికల్ స్ట్రైక్ చేశారు, ధోనీ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో సర్కిల్ బయట ఆరుగురు ఫీల్డర్లు ఉన్నారు. అది మీకు కనిపించలేదా? అంటూ సెటైర్లు విసురుతూ పోస్టులు పెడుతోంది. 
 
అయితే ఐసీసీ తీరుపై భారత ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. భారత్‌ టోర్నీ నుంచి నిష్క్రమించినందుకు ఐసీసీ చాలా సంతోషిస్తుందనుకుంటా, ఇప్పటికే బాధలో ఉన్నాం. మమ్మల్ని వేధించకండి. మేము ఇక భరించలేమని కామెంట్లు చేస్తున్నారు.