శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Updated : గురువారం, 11 జులై 2019 (16:37 IST)

మీరు ఇలాగే స్ఫూర్తి రగుల్చుతుండాలి : జడేజా భావోద్వేగ ట్వీట్

ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ క్రికెట్ కప్ టోర్నీ నుంచి భారత్ నిష్క్రమించింది. బుధవారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో 18 పరుగుల తేడాతో ఓడిపోవడంతో ఈ టోర్నీ నుంచి వైదొలగింది. లీగ్ దశలో అద్భుతంగా రాణించిన కోహ్లీ సేన.. తుది అంకం మొదటి దశలో చేతులెత్తేసింది. ఫలితంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే, ఈ మ్యాచ్‌లో భారత్ ఓడినప్పటికీ.. ప్రతి ఒక్కరి హృదయాలను గెలుచుకుంది. ముఖ్యంగా, చివరి మ్యాచ్‌లో అద్భుత పోరాటం చేసిన రవీంద్ర జడేజాపై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. 
 
దీనిపై రవీంద్ర జడేజా భావోద్వేగంతో కూడిన ట్వీట్‌ చేశారు. ప్రతి పతనం తర్వాత పైకిలేవడం ఎలాగో క్రీడలు నాకు నేర్పాయి. ఓటమిని అంత తేలిగ్గా అంగీకరించవద్దన్న దృక్పథం కూడా క్రీడల ద్వారానే అలవడింది. అపారమైన స్ఫూర్తిని కలిగించిన ప్రతి అభిమానికి థ్యాంక్స్ చెప్పడం చాలా అల్పమైన విషయం. మీ మద్దతుకు కృతజ్ఞతలు. మీరు ఇలాగే స్ఫూర్తి రగుల్చుతుండాలి. నా తుది శ్వాస వరకు అత్యుత్తమ క్రికెట్ ఆడేందుకు ప్రయత్నిస్తాను అంటూ జడేజా తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.